- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సర్పంచ్ ఇంట్లో పారిశుద్ధ్య కార్మికుల వెట్టిచాకిరి..
దిశ, అమరచింత: ఆ గ్రామంలో పనిచేసే పారిశుధ్య కార్మికులను సర్పంచ్ సొంత ఇంటి పనులకు వాడుకోవడం చర్చనీయాంశంగా మారింది. సర్పంచ్ ఇంట్లో పనిచేస్తేనే వేతనాలు వస్తాయన్న భ్రమలో పడ్డారు కార్మికులు. వివారల్లోకి వెళితే.. వనపర్తి జిల్లా అమరచింత మండల పరిధిలోని మస్తీపూర్ గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులు గ్రామంలో పారిశుధ్య పనులు చేస్తూనే, సర్పంచ్ ఇంట్లో అన్ని పనులు చేయడం పరిపాటిగా మారింది. అభం శుభం తెలియని కష్టజీవులను బాధ్యత గల సర్పంచ్ వెట్టిచాకిరి పనులు చేయించుకోవడం పట్ల స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఇటీవల మే నెల 7 వ తేదీన సర్పంచ్ కూతురు వివాహం జరిగింది. శనివారం కార్మికులు సర్పంచ్ ఇంట్లో ఉన్న పెళ్ళిపందిరి తొలగించి, చీపుర్లతో వాకిలి శుభ్రం చేయడం దిశ విలేకరి కంట పడింది. కార్మికులు తరచూ, సర్పంచ్ ఇంట్లో పనిచేయడం పంచాయతీ కార్యదర్శికి తెలిసినప్పటికీ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.