- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అంత్యక్రియలు ముగించుకుని వస్తుండగా రోడ్డు ప్రమాదం..
దిశ, జడ్చర్ల: జడ్చర్ల మండల పరిధిలోని కొత్త తండా వద్ద కారు, స్కూటీ ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు రోడ్డు నిర్మాణంలో లోపాలే కారణమని తాండ పరిసరాలో స్పీడ్ బ్రేకులు ఏర్పాటు చేయాలంటూ గిరిజనలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కొత్త తండా కు చెందిన ఓ వ్యక్తి మృతి చెందడంతో అంత్యక్రియలు ముగించుకుని తండాకు చెందిన శంకర్ నాయక్, సాయి శంకర్ తమ స్కూటీపై తిరుగు ప్రయాణంలో రోడ్డు దాటుతుండగా.. జడ్చర్ల వైపు నుంచి వేగంగా వస్తున్న క్వాలిస్ వాహనం స్కూటీని వేగంగా ఢీకొనడంతో స్కూటీపై ఉన్న శంకర్ నాయక్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో క్షతగాత్రులను ముగ్గురిని కుటుంబీకులు చికిత్స నిమిత్తం 108 సాయంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు.
జాతీయ రహదారిలో నిర్మాణ లోపాలతోనే కొత్త తండా వద్ద అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో స్పీడ్ బ్రేకులు నిర్మించాలని 167 వ జాతీయ రహదారిపై సుమారు రెండు గంటల పాటు బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో సంఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను బుజ్జగించారు. జాతీయ రహదారిపై కొత్త తండా వద్ద వేగ నియంత్రిక బోర్డులను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో గిరిజనులు ఆందోళన విరమించారు.