- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పారిపోయిన..గురుకుల విద్యార్థి దొరికాడు
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : కోయిలకొండ మండల కేంద్రం గురుకుల పాఠశాల నుంచి వెళ్లిపోయిన విద్యార్థి ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. బీసీ బాలుర గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన పోటీ పరీక్షలకు హాజరుకాగా.. ఓ ఇంటర్మీడియట్ అమ్మాయితో ఏర్పడ్డ పరిచయాన్ని ప్రేమగా భావించి..ఎలాగైనా ఆ అమ్మాయిని చేరుకుంటాను అని చెప్పడంతో పాటు.. తనను తల్లిదండ్రులు, మిత్రులు క్షమించాలని లేఖ రాసి పరార్ అయిన విషయము పాఠకులకు విద్యుతమే. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆ విద్యార్థి తన తల్లిదండ్రులు ప్రమాదంలో మరణించారని, తనకు ఎవరూ లేరని చెప్పి మెట్టుగడ్డలో ఉన్న ఓ టిఫిన్ సెంటర్ లో పనికి చేరాడు. ఆ సెంటర్ ను నిర్వహించే కుటుంబం ఆ విద్యార్థికి షెల్టర్ ఇచ్చారు. ఆ విద్యార్థి కొంతమంది మిత్రులతో తాను హైదరాబాదులో ఉన్నానని..సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఆ విద్యార్థి తప్పిపోయిన విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న టిఫిన్ సెంటర్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే కేసు నమోదు చేసుకొని విద్యార్థి కోసం గాలిస్తున్న కోయిలకొండ ఎస్సై భాస్కర్ రెడ్డి విద్యార్థిని అదుపులోకి తీసుకొని రూరల్ పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ తాను ప్రేమించిన అమ్మాయి కోసం వచ్చానని కాకుండా.. నాకు ఇష్టం లేకపోయినా మా తల్లిదండ్రులు గురుకుల పాఠశాలలో చేర్పించారు. తనకు చదవడం ఇష్టం లేదంటూ విద్యార్థి పోలీసులకు చెప్పాడు. విద్యార్థికి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన..తను పాఠశాలకు వెళ్ళనంటూ మొండికి వేశాడు. తల్లిదండ్రులను పిలిపించి ఆ విద్యార్థిని అప్పగించారు. తప్పిపోయిన విద్యార్థి దొరకడంతో..గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థులు ఊపిరిపించుకున్నారు.