Abhayastam Scheme : ప్రజా భవన్ లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ప్రారంభం

by Kalyani |   ( Updated:2024-07-20 16:35:45.0  )
Abhayastam Scheme : ప్రజా భవన్ లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ప్రారంభం
X

దిశ, గద్వాల టౌన్ : హైదరాబాద్ ప్రజాభవన్ లో రాష్ట్రం నుంచి సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన రాష్ట్ర అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో‌ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సీఎం సలహాదారు (ప్రోటోకాల్ ) హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్యేలు, ఎంపీ లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సింగరేణి సీఎండీ బలరాం ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story