- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rain water : వెలవెల బోతున్న చెరువులు.. కుంటల లోగిళ్ళు..
దిశ, నవాబుపేట : చిన్నపాటి వర్షాలే తప్ప భారీ వర్షాలు కురవకపోవడం కారణంగా ఈ వర్షాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడిచినా కూడా జిల్లాలో చెరువులు, కుంటల దరికి వరద నీరు చేరలేదు. వర్షాకాలం సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ వర్షాలు కురియక పోవడం వల్ల వరిపంట సాగుకు రైతులు జంకుతున్నారు. గత సంవత్సరం కూడా జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున ఈ సంవత్సరం భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. గత సంవత్సరం భూగర్భ జలాలు 9.32 మీటర్ల లోతులో ఉండగా ఈ సంవత్సరం 11.88 మీటర్ల లోతుకు పడిపోయాయి. గతేడాది కంటే మరో 2. 55 మీటర్ల లోతుకు నీరు పడిపోవడంతో బోరు బావుల్లో నీరు ఇంకిపోయింది.
దానివల్ల జిల్లాలో వరి పంట సాగు విస్తీర్ణం బాగా తగ్గింది. జిల్లాలో ఈ ఏడాది వరి పంట సాగు విస్తీర్ణం 1,77,445 ఎకరాలు కాగా ఇప్పటి వరకు అందులో సగం విస్తీర్ణంలో కూడా వరి పంట సాగుకు నోచుకోలేదు. అందుకు కారణం జిల్లాలోని రైతాంగం అత్యధికంగా బోరు బావులు, చెరువులు, కుంటల పై ఆధారపడి వరి పంట సాగు చేసే రైతులే ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో మొత్తం 605 చెరువులు, కుంటలు ఉండగా అందులో కొన్ని చెరువులు, కుంటలలో మాత్రమే కొంతమేర నీరు ఉంది. 200 ల చెరువులలో నీటి చుక్క కూడా లేదు. చిన్నపాటి వర్షాలు కురువడమే తప్ప భారీ వర్షాలు కురవకపోవడంతో వరి పంట సాగు చేయడానికి రైతులు భయపడుతున్నారు. కనీసం పశువులకు తాగునీరు కూడా పుష్కలంగా లభించక పోతుండడంతో రైతులు అల్లాడిపోతున్నారు.
వర్షం సమృద్ధిగా కురువక వెలవెలబోతున్న చెరువులు, కుంటలు, బోరు బావులను చూసి రైతులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. వరి పంట సాగుకు అవసరమైన కాలం కరిగి పోతుండడంతో రైతుల ఆవేదన ఆక్రందన రోజు, రోజుకు అధికమవుతుంది. వర్షాకాలం పండిన పండుగ పోయిన పంటలు సాగుచేసి చూడాలనే నానుడి ఉన్న కనీసం వరి నాట్లు వేసుకోవడానికి కూడా అనుకూలంగా వర్షానికి రైతులు పంట సాగుకు సాహసించడం లేదు. పంట సాగుకు అవసరమైన నారు ముదిరి పోతుండడంతో రైతుల్లో ఆందోళన అధికమవుతుంది. ఇప్పుడు భారీ వర్షాలు కురువకపోతే ఇక మున్ముందు వర్షాన్ని నమ్ముకునే పరిస్థితులు ఉండవని రైతుల అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా వరుణుడు కరుణించి సమృద్ధిగా వర్షం కురిపించాలని, తమ పంటల సాగుకు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని వరుణ దేవుడిని రైతులు వేడుకుంటున్నారు.