- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘మనఊరు మనబడి’తో నాణ్యమైన విద్య: ఎమ్మెల్యే ఆల
దిశ, దేవరకద్ర: తెలంగాణలో నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ గ్రామంలో బుధవారం మనఊరు మనబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగాఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై రూ. 48.63 లక్షలతో నూతనంగా నిర్మించిన పాఠశాలను ప్రారంభించారు. పాఠశాల ప్రారంభించిన అనంతరం చిన్నారులతో కేక్ కట్ చేయించి చిన్నారులకు తినిపించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను చేరువ చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం ముందుకు సాగుతోందన్నారు. పాఠశాలల అభివృద్ధి విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేసినట్లవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎంపీపీ రమా శ్రీకాంత్ యాదవ్, జడ్పీటీసీ అన్నపూర్ణ శ్రీకాంత్, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుజాత శేఖర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ విజయ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.