మానవత్వం మరిచిన జనాలు.. శవం కుళ్లిపోయినా పట్టించుకోకుండా ఇసుక తరలింపు

by Hamsa |
మానవత్వం మరిచిన జనాలు.. శవం కుళ్లిపోయినా పట్టించుకోకుండా ఇసుక తరలింపు
X

దిశ, పెబ్బేరు: మండల పరిధిలోని రంగాపూర్ పుష్కర ఘాట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి శవం కనిపించింది. గత నాలుగు రోజులుగా అక్కడే పడి ఉన్నా చూస్తూ చూడనట్లు రంగపూర్ వ్యక్తులు ఎద్దుల బండ్లతో ఇసుక అక్రమంగా తరలిస్తూ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మానవత్వం మరిచారు. ఒకవేళ పోలీసులకు సమాచారం ఇస్తే ఎద్దుల బండ్లతో ఇసుక అక్రమంగా తరలించేది ఆగిపోతుందనే ఉద్దేశంతో సాటి మనిషి శవం కుళ్లిపోయి వాసన వస్తున్న కూడా వారు పట్టించుకోకుండా ఇసుకను తరలిస్తున్నారు. మానవత్వం మంట కలిసి పోతోందనడానికి నిదర్శనం ఈ గుర్తు తెలియని శవమే నిదర్శనం.

Advertisement

Next Story