- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ అంటే మోడీకి ఎందుకు అంత కక్ష.. మంత్రి కేటీఆర్
దిశ ప్రతినిధి, వనపర్తి : తెలంగాణ రాష్ట్రం అంటే నరేంద్ర మోడీకి ఎందుకు అంత కక్ష ఉందో అర్థం కావడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. పాలమూరు పర్యటనకు వస్తున్న ప్రధానమంత్రి మోడీ ముందుగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. శుక్రవారం వనపర్తి జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
అనంతరం సాయంత్రం జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించిన వనపర్తి పదేళ్ల ప్రగతి మహాసభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పై నిప్పులు చెరిగారు. వాల్మీకీ బోయలకు ఎస్టీ హోదా కల్పించాలని రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ముందు వాల్మీకుల చిరకాల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే కృష్ణా నీటిలో తెలంగాణకు రావలసిన 575 టీఎంసీల వాటాను కేటాయించాలని దీనిపై ప్రధాని భూత్పూర్ సభలో ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికలలో అత్యధికంగా ఎంపీ స్థానాలు కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి మనం చేరుకుంటామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.