తాళ్లపల్లి గ్రామంలో క్షుద్ర పూజల కలకలం..

by Sumithra |   ( Updated:2024-11-03 07:49:31.0  )
తాళ్లపల్లి గ్రామంలో క్షుద్ర పూజల కలకలం..
X

దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం తాళ్లపల్లి గ్రామంలో పత్తి చేనులో క్షుద్ర పూజలు చేసిన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకోగా ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో భూమి యజమానులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాళ్లపల్లి గ్రామానికి చెందిన చిలికేశ్వరం పెద్ద తిరుపతయ్య తనకున్న పొలంలో పత్తి చేను సాగు చేసుకుంటున్నాడు. అది చూసి ఓర్వలేని అదే గ్రామానికి చెందిన సొంత కుటుంబీకులైన చిలికేశ్వరం కృష్ణయ్య, అతని కుమారులు మహేష్, శివ ఇద్దరు అన్నదమ్ములు హైదరాబాదులో నివాసముంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇరువురు అన్నదమ్ముల మధ్య భూ సమస్య ఉంది. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టినా పరిష్కారం కాలేదు.

ఒకరి పై ఒకరు పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. అది జీర్ణించుకోలేని కృష్ణయ్య కుమారులు శుక్రవారం అమావాస్య ఉండడంతో తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో తాళ్లపళ్లి గ్రామానికి చేరుకుని కారువంగా శివారులో గల తమ పత్తి చేనులో క్షుద్ర పూజలు నిర్వహించారు. ఎలాంటి ఆధారాలు లేకున్నా భూమిలో భాగం కావాలంటూ ఇలాంటి దౌర్జన్యాలకు పాలు పడుతున్నారని భూమి యజమాని వాపోతున్నారు. ఈ క్షుద్ర పూజలకు అన్నదమ్ములు కారణమని గ్రామంలోని ప్రజలు చెబుతున్నారు. ఇలాంటి క్షుద్ర పూజలు నిర్వహిస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ లో పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా శుద్ర పూజలు కలకలం రేపడంతో ఆ గ్రామంలోని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed