అధికారుల నిర్లక్ష్యం.. కాంట్రక్టర్ల కక్కుర్తి బట్టబయలు

by Disha News Web Desk |
అధికారుల నిర్లక్ష్యం.. కాంట్రక్టర్ల కక్కుర్తి బట్టబయలు
X

దిశ, నాగర్‌కర్నూల్: భూగర్భ జలాలను పెంచేందుకు దుందుబీ నదిలో నిర్మాణం చేపట్టిన చెక్ డ్యామ్‌లు చిన్నపాటి నీటి వత్తిడికే కూలిపోతున్నాయి. జడ్చర్ల, తిమ్మాజీపేట, బిజినపల్లి, తాడూరు మండలాలను తాకుతూ డిండి చెరువులోకి ఉరకలు పెడుతున్న కృష్ణా నీటిని భూగర్భంలో నిక్షిప్తం చేసి రైతుల పంటపొలాలను తడిపేందుకు దుందుబీ నది పొడవునా పదుల సంఖ్యలో చెక్ డ్యాములు నిర్మించారు. వీటి నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఎంతో కృషి చేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకు ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. కానీ, నిర్మించిన కొద్ది రోజులకే కూలిపోతున్నాయి. దీంతో అధికారుల అలసత్వం, కాంట్రక్టర్ల కక్కుర్తి బట్టబయలు అయింది స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం తాడూరు మండలం సిర్సావాడలోని చెక్ డ్యామ్ పూర్తిగా ధ్వంసమయ్యింది. దీని విలువ రూ.7 కోట్లు. మరో చెక్ డ్యామ్ నెర్రెలు పారుతోందని ఆయా గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ, చెక్ డ్యామ్ నిర్మాణం కోసం తవ్విన ఇసుక ఎక్కడికెళ్లిందన్న సందేహం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇంత జరుగుతున్నా.. సైలెంట్‌గా ఉన్న అధికారులు, ప్రజా ప్రతినిధులపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని స్థానిక ప్రజలు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed