- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Crime News:వ్యక్తి దారుణ హత్య.. జననాంగాలపై కొట్టి చంపిన తల్లి, కొడుకు
దిశ, జడ్చర్ల: జడ్చర్ల మండలంలో దారుణం చోటుచేసుకుంది. తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తిపై పదునైన ఆయుధంతో.. తల్లి, కొడుకు కలిసి జననాంగాలపై కొట్టి దారుణంగా హత్య చేసి పరారయ్యారు. జడ్చర్ల ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. జడ్చర్ల మండలం నెక్కొండ గ్రామానికి చెందిన గుద్దేటి చెన్నకేసి అలియాస్ బన్నీ(50), హైదరాబాద్‌లోని చార్మినార్ లాల్ దర్వాజా ప్రాంతానికి చెందిన ఎం అంజమ్మతో కలిసి కొన్ని సంవత్సరాలుగా నెక్కొండ గ్రామంలో సహజీవనం చేస్తున్నాడు.
ఈ క్రమంలో వీరి మధ్యలో చిన్న చిన్న గొడవలు తరచుగా జరిగేవని.. వీరితోపాటు అంజమ్మ కొడుకు చిన్నబాబు అలియాస్ చెన్నకేశవులు కూడా వీరితో పాటే ఉండేవాడని పోలీసులు తెలిపారు. కాగా మంగళవారం రాత్రి ముగ్గురు తాగిన మైకంలో ఓ విషయంలో గొడవ పడ్డారని.. ఈ క్రమంలో అంజమ్మ తన కొడుకు చెన్నకేశవులుతో కలిసి చెన్నకేశ(బన్ని)పై పదునైన ఆయుధాలతో జననాంగాలపై తీవ్రంగా కొట్టారు. దీంతో అధిక రక్తస్రావమై చెన్నకేశి అక్కడికక్కడే మృతి చెందాడు. చెన్నకేశి మృతి చెందిన విషయాన్ని గమనించిన అంజమ్మ తన కొడుకుతో కలిసి ఊర్లోనుండి పరారైంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు జడ్చర్ల పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.
కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం చెన్నకేసి మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెన్నకేసిని దారుణంగా హత్య చేసి పరారైన అంజమ్మ చెన్నకేశవులు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ ఘటనతో నెక్కొండ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్న చేన్నకేసి అంజమ్మ కొన్ని రోజులపాటు సజావుగానే ఉన్నారని.. ఆ తర్వాతనే తాగుడకు బానిసలై తరచుగా గొడవలు చేసుకునే వారని.. ఇంత దారుణానికి వడిగడుతారని భావించలేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
- Tags
- Crime News Today