- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Peta Collector : రుణమాఫీ ప్రక్రియ తీరును పర్యవేక్షించిన..
దిశ, దామరగిద్ద : మండలంలోని ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ కు మంగళవారం నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ రైతు రుణమాఫీ పథకం తీరును పర్యవేక్షించారు. రుణమాఫీ ప్రక్రియను ఎలా చేస్తున్నారని బ్యాంకు, వ్యవసాయ శాఖ సిబ్బందిని విచారించారు. రైతులకు ఏ విధంగా రుణమాఫీ ప్రక్రియ నిర్వహిస్తున్నారని. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నగదు ఏ విధంగా వారికి అందిస్తున్నారని అడిగారు. అదేవిధంగా సకాలంలో పంట రుణాలు రెన్యువల్ జరుగుతున్నాయా ? లేదా రైతులు ఏమైనా ఇబ్బందికి గురవుతున్నారా ? అని బ్యాంక్ , వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతుల నుంచి వచ్చే గ్రీవెన్స్ ను ఏ విధంగా పరిశీలిస్తున్నారని జిల్లా కలెక్టర్ సిబ్బందిని అడిగారు. ఇప్పటి వరకు రుణమాఫీ లబ్ధిదారులు ఎంతమంది, బ్యాంకు లోన్ వివరాలు ఎన్ని, రెన్యువల్స్ జరిగాయి అనే విషయాలను ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ కలెక్టర్ కు వివరించారు.
కాగా అక్కడికి వచ్చిన రుణ మాఫీ లబ్దిదారుల ( రైతుల)తో కలెక్టర్ మాట్లాడారు. కొంత మంది రైతుల స్టేటస్ ను రుణమాఫీ పోర్టల్ లో ఆధార్ స్టేటస్ ద్వారా విచారణ చేసి వారికి నగదు ఏ దశలో వస్తుందని కూడా రైతులకు ఆమె వివరించారు. రైతులందరూ బ్యాంకు, వ్యవసాయ శాఖ సిబ్బందికి సహకరించి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించడానికి సహకరించాలని రైతులను ఆమె కోరారు. గ్రీవెన్స్ ఎప్పటికప్పుడు పూర్తి చేసి రైతుల సందేహాలను నివృత్తి చేయాలని అందరిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, జిల్లా బ్యాంక్ ఎల్డీఎం విజయ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి ప్రదీప్ కుమార్, ఏఈఓ శివ జ్యోతి, స్థానిక ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్, తహశీల్దార్ జయ రాములు, ఎంపీడీవో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.