ఎన్నికల వేళ తెలంగాణలో రేర్ సీన్.. గంట తేడాతో ఒకే జిల్లాకు ప్రధాని మోడీ, CM రేవంత్..!

by Disha Web Desk 19 |
ఎన్నికల వేళ తెలంగాణలో రేర్ సీన్.. గంట తేడాతో ఒకే జిల్లాకు ప్రధాని మోడీ, CM రేవంత్..!
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: ఉమ్మడి పాలమూరు జిల్లాలో శుక్రవారం ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొనబోతోంది. గంట తేడాతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లాలో నిర్వహించనున్న బహిరంగ సభలకు హాజరుకానున్నారు. ఓకే పార్లమెంటు నియోజకవర్గం.. ఓకే జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రధానమంత్రి ఒక నియోజకవర్గంలో.. సీఎం పాల్గొని బహిరంగ సభ మరో అసెంబ్లీ నియోజకవర్గంలో గంట తేడాతో జరగనుండడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రాజకీయపరమైన ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంటుంది.

పోలీసులకు ఇబ్బందికరంగా పరిస్థితులు..

ఎన్నికల ప్రచారాలలో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకోవడం సర్వసాధారణం. కానీ ఒకే జిల్లా.. ఒకే పార్లమెంట్ నియోజకవర్గంలో గంట తేడాతో దేశ ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొని బహిరంగ సభలు జరుగుతూ ఉండడం ఉమ్మడి పాలమూరు జిల్లాపై పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీల నాయకులు చేస్తున్న ప్రయత్నాలకు నిదర్శనంగా నిలుస్తోంది.

పోటాపోటీగా జన సమీకరణ..

రాష్ట్రంలో మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం రాజకీయంగా ఉత్కంఠను కలిగిస్తోంది. ఈ నియోజకవర్గ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీ చంద్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా మన్నే శ్రీనివాస్ రెడ్డి పోటీలో ఉన్న విషయం పాఠకులకు విధితమే. కాగా, నారాయణపేట జిల్లా కేంద్రంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా నిర్వహించనున్న బహిరంగ సభకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. మక్తల్‌లో నిర్వహించే సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.

ఒక గంట తేడాతో పక్కపక్కన ఉన్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో భారీ బహిరంగ సభలను నిర్వహించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో జన సమీకరణ చేయడం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలకు కత్తి మీద సాముల మారింది. ప్రధానమంత్రి సభకు గానీ, ముఖ్యమంత్రి సభకు గానీ పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి తమ సత్తా చాటుకోవాలని భావించిన నాయకులు జన సమీకరణ చేసి తమ సత్తా చాటుకోవాలని చూస్తూ ఉన్నారు.

పోలీసులకు ఇబ్బందులే..!

గంట తేడాతో ఓకే జిల్లాలో ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటిస్తూ ఉండడం పోలీస్ యంత్రాంగంలో ఉత్కంఠను కలిగిస్తోంది. భారీ ఎత్తున వచ్చే జనాలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడం, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేయడం వంటి అంశాలు పోలీసు యంత్రాంగానికి సవాలుగా మారుతున్నాయి. ఓకే జిల్లాలో గంట తేడాతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ఉండడం అంత సులభం కాదని పోలీసులు అంటున్నారు.

శాంతి భద్రతల పరిరక్షణ, సమావేశం జరుగుతున్నప్పుడు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడం వంటి అంశాలు పోలీసు యంత్రాంగానికి సవాల్‌గా మారుతున్నాయి. మొత్తం మీద పీఎం, సీఎం సభల నిర్వహణలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా పోలీసు యంత్రాంగం పెద్ద ఎత్తున హాజరై భద్రతా చుట్టుపట్టాల్సిన అంశాలపై చర్చలు నిర్వహించనున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed