56% రోగాలకు కారణం అవే.. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టిప్స్ ఫాల్లో అవ్వండి

by Javid Pasha |   ( Updated:2024-05-20 13:30:26.0  )
56% రోగాలకు కారణం అవే.. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టిప్స్ ఫాల్లో అవ్వండి
X

దిశ, ఫీచర్స్ : మారుతున్న జీవన శైలి, కొన్ని రకాల ఆహారపు అలవాట్లు మానవ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం, ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గడం, ఈటింగ్ అండ్ స్లీపింగ్ టైమింగ్స్‌ దారితప్పడం వంటి కారణాలవల్ల వివిధ వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే ప్రస్తుతం 56 శాతం రోగాలకు అన్‌హెల్తీ ఫుడ్స్ కారణం అవుతున్నాయని నిపుణులు గుర్తించారు.

సోడియం అండ్ షుగరింగ్ కంటెంట్ అధికంగా ఉండే పిజ్జా, బర్గర్, చిప్స్, కూల్ డ్రింక్స్ వంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వంటివి రోగాలు లేదా వ్యాధులకు కారణం అవుతున్నాయి. దీనికి తోడు అధిక ప్రోటీన్ కలిగిన సప్లిమెంట్లు కూడా వివిధ అనారోగ్యాలకు దారితీస్తున్నాయి. వీటన్నింటివల్ల ఎముకల్లో బలహీనత, మనిరల్స్ తగ్గడం, కిడ్నీ వ్యాధులు, గుండె జబ్బులు, ఒబేసిటీ, డయాబెటిస్ వంటి అనారోగ్యాలు, వ్యాధులు వస్తాయి. అందుకే తగిన పౌష్టికాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

తినే ఆహారంలో పోషకాల లోపం లేకుండా చూసుకోవాలి. అలాగని మరీ ఎక్కువైనా రిస్కే కాబట్టి సమతుల ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. భోజనానికి గంట ముందు నుంచి టీ, కాఫీ, అదర్ కెఫీన్ కంటెంట్స్ కలిగి ఆహారాలు తీసుకోవద్దు. బలం వస్తుందని ప్రోటీన్ పౌడర్లు అతిగా వాడితే ప్రమాదం. కొవ్వు పదార్థాలు, చక్కెర, ఉప్పు వంటివి లిమిట్‌లో ఉండేలా చూసుకోవాలి. పొటాషియం, కాల్షియం, విటమిన్లు సహజంగా లభించే పండ్లు, కూరగాయలు, పప్పులు, చిక్కుళ్లు తీసుకోవాలి. పిండి పదార్థాలు, దుంపలు పరిమితిగా తీసుకోవాలి. ఇటువంటి ఆహారపు అలవాట్లతో అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చు.

Advertisement

Next Story

Most Viewed