- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉమామహేశ్వర ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం తెలపడంతో ఎమ్మెల్యే సర్వమత ప్రార్థనలు
దిశ, అచ్చంపేట : మంత్రివర్గం క్యాబినెట్ నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రాంతానికి సాగునీరు ఇచ్చే ఉమామహేశ్వర ప్రాజెక్టు, రాయల గండి మద్దిమడుగు అలాగే నిరంజన్ షావలి ఎత్తిపోతల పథకం పనులకు గురువారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్ డాక్టర్ గువ్వల బాలరాజు మద్దిమడుగు వద్ద బస చేసి.. శుక్రవారం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం దారి పొడవునా పదరా, అమ్రాబాద్ మండలం ప్రజలు పటాసులు కాలుస్తూ ఘనంగా స్వాగతం పలికారు. అలాగే రాయల గండి మన్ననూరు గ్రామంలోని చర్చి, రంగాపూర్ వద్ద ఉన్న నిరంజన్ షావలి దర్గా, ఉమామహేశ్వరం ఆలయం వద్ద సర్వమత ప్రార్థనలు చేశారు.
అనంతరం అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా జై తెలంగాణ, దేశ్ కి నేత సీఎం కేసీఆర్, కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, అచ్చంపేట రైతుల ఐక్యత వర్ధిల్లాలని నినదించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు జడ్పీటీసీ రాంబాబు, మంత్రియా నాయక్, సర్పంచులు శ్రీరాం నాయక్ పెద్దిరాజు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, అంజియాదవ్, పర్వతాలు, జిల్లానేతలు చెన్నకేశవులు, శ్రీనివాసులు, అనిల్, బాలస్వామి, నిరంజన్, వెంకటయ్య, పర్వతాలు, రాజారాం, సత్యం, జావేద్, రవికుమార్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.