- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA Dr. Vamsikrishna : అక్కమ్మ దేవి గుహను సందర్శించిన ఎమ్మెల్యే..
దిశ, అచ్చంపేట : నల్లమల శ్రీశైలం ప్రాజెక్టు వెనుక శ్రీశైలం ఆలయం సమీపంలో కొలువుదీరిన ప్రముఖ ప్రఖ్యాత అక్కమదేవి గుహలను ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదివారం అటవీ శాఖ అధికారులతో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నల్లమల్ల అడవులు అనగానే అనేక శివాలయాలకు పకృతి సంపదకు నిలయమని శ్రీశైలం నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లమల కొండ వద్ద ఉన్న అక్కమదేవి గుహలు ఉన్నాయన్నారు.
ఇది నల్లమల శ్రీశైలం చరిత్రలోనే ఒక ముఖ్యమైన ప్రదేశం. ఈ గుహలు పూర్వ చారిత్రక కాలాల నుండి ఉన్నాయని ప్రజల నమ్మకం అన్నారు. అక్కమహాదేవి గుహలకు 12వ శతాబ్దపు కాలంలో గొప్ప సాధువు, తత్వవేత్త అయిన అక్క మహాదేవి పేరు పెట్టారన్నారు. ఆమె వీరశైవ భక్తి ఉద్యమంతో అనుబంధం కలిగి ఉందని, ఉద్యమంతో పాటు కన్నడ భక్తి సాహిత్యానికి గొప్పగా ప్రతీక అన్నారు. ఆమె ఇక్కడ గుహలలో తపస్సు చేసిందని, పురాణాల ప్రకారం, అక్కమహాదేవి గుహలోని శివలింగానికి ప్రార్థనలు చేసేదని చరిత్ర తెలుపుతుంది. పర్యాటక అభివృద్ధి చేసే క్రమంలోనే అక్రమ దేవి గుహలను సందర్శించినట్లు తెలిపారు.