- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రుల పర్యటనకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే, డీఎస్పీ
దిశ ,మక్తల్ : నియోజకవర్గంలో సంగంబండ ప్రాజెక్టులో పెండింగ్ పనులను పరిశీలించేందుకు బుధవారం మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రానున్నారు. ఈ సందర్భంగా సంగంబండ గ్రామంలోని హెలిప్యాడ్ సభాస్థలి పార్కింగ్ పనులను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, జిల్లా ఎస్పీ యోగేష్, నారాయణపేట డీఎస్పీ లింగయ్య సీఐ చంద్రశేఖర్, ఎస్సై భాగ్య లక్ష్మి రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. ఇద్దరు మంత్రులు హెలికాప్టర్‌లో రావడంతో హెెలిప్యాడ్ పనులను పార్కింగ్, సమావేశానికి పార్లమెంటు సభ్యుడు సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీ చందర్ రెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు హాజరవుతున్నందున నిర్వహించే వేదిక పనులను పరిశీలించారు.
ప్రాజెక్టులో ఎడమ లోవెస్ట్ కెనాల్‌లో దాదాపు 300 మీటర్ల పొడవైన బండరాయి అడ్డు రావడంతో ఆ కెనాల్ కాలువను ప్రారంభానికి నోచుకోలేదు. దాదాపు 12 గ్రామాలలోని 3 వేల ఎకరాల భూమి సాగుకు నోచుకోలేదు. ఈ పెండింగ్ పనులపై గత ప్రభుత్వాలు" బూచి"గా చూపించి ఎన్నికల్లో పలు పార్టీల నాయకులు ఓట్లు దండుకుంటున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అడ్డుగా ఉన్న బండ రాయిని తొలగిస్తామని ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున ఇచ్చిన మాటకు మ అనుగుణంగా బండను తొలగించి కాలువను పునరుద్దించేందుకుగాను నేలరోజుల క్రిందట నిధులను మంజూరు చేసింది. పనులు ప్రారంభించడానికి ప్రస్తుతం ఎన్నికల కోడు అడ్డు రావడంతో శంకుస్థాపన చేయకుండానే పనులు చేయించడానికి పర్యవేక్షించేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సాగునీటి ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు రావడం జరుగుతుందని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఈ పర్యవేక్షణలో పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.