అభివృద్ధి మాది, మత ఘర్షణలు మీవి: Minister Srinivas Goud

by S Gopi |   ( Updated:2022-08-24 11:23:18.0  )
అభివృద్ధి మాది, మత ఘర్షణలు మీవి: Minister Srinivas Goud
X

దిశ, మహబూబ్ నగర్: టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తుంటే కొన్ని మతతత్వ శక్తులు మత ఘర్షణలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పట్టణంలోని హనుమాన్ పురలో ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీలకతీతంగా పట్టణాన్ని ప్రశాంతంగా ఉండేలా చూసుకుందామని, పనిచేసే ప్రభుత్వానికి అందరూ అండగా నిలబడాలని ఆయన కోరారు. 70 ఏళ్లుగా అధికారం అనుభవించిన నాయకులు స్థానిక సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడ్డాక కరెంటు, తాగునీరు, విద్య, వైద్యంతో సహా సమస్యలన్నిటినీ తీర్చడంతో ప్రజలకు ప్రభుత్వంపై భరోసా ఏర్పడిందన్నారు. టీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పనిచేసేవారికి తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు.

అనంతరం కాంగ్రెస్ నాయకుడు అన్వర్ తోపాటు పాండు, రహీం, బషీర్ లతో సహా పలువురు మహిళలు, కార్యకర్తలు భారీగా పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి ఆయన ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొరమోని నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, ప్రధాన కార్యదర్శి వినోద్, కౌన్సిలర్లు మునీర్, కట్టా రవికిషన్ రెడ్డి, జీవన్ కుమార్, చిన్న, సుభాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story