Revanth Reddy: అణగారిన వర్గాల గొంతుక పీజేఆర్‌.. సీఎం ఘన నివాళులు

by Ramesh Goud |
Revanth Reddy: అణగారిన వర్గాల గొంతుక పీజేఆర్‌.. సీఎం ఘన నివాళులు
X

దిశ, వెబ్ డెస్క్: అణగారిన వర్గాల గొంతుక మాజీ మంత్రి పీజేఆర్(PJR) అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. మాజీ సీఎల్పీ నేత(Former CLP Leader) పీజేఆర్ వర్ధంతి సందర్భగా సీఎం నివాళులు(Tributes) అర్పించారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో పీజేఆర్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన.. పేదలకు నిత్యం ఆసరాగా నిలిచే వ్యక్తి మాజీ మంత్రి పి. జనార్దన్‌రెడ్డి (పీజేఆర్‌) అని, నిత్యం పేద ప్రజల గొంతుకగా నిలిచారని కొనియాడారు. అలాగే పీజేఆర్ 1994 నుంచి 1999 వరకు సీఎల్పీ నేతగా పనిచేశారని, ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు శ్రమించారని తెలిపారు. తెలంగాణ కోసం బలమైన గొంతుకగా నిలిచారని చెబుతూ.. రాష్ట్రానికి పీజేఆర్ చేసిన సేవలను రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed