BSNL: బీఎస్ఎన్ఎల్ కీలక నిర్ణయం.. త్వరలో రెండో దశ వీఆర్ఎస్ ప్రక్రియ అమలు..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-12-28 13:29:16.0  )
BSNL: బీఎస్ఎన్ఎల్ కీలక నిర్ణయం.. త్వరలో రెండో దశ వీఆర్ఎస్ ప్రక్రియ అమలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సంస్థలోని 35 శాతం మంది ఉద్యోగులను(Employees) ఇంటికి పంపే యోచనట్లో ఉన్నట్లు సమాచారం. దీని కోసం రెండో దశ స్వచ్చంధ పదవీవిరమణ పథకం(VRS) అమలు చేయనున్నట్లు పలు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ కేంద్ర ఆర్థికశాఖ(Finance Department) అనుమతి కోరినట్లు సమాచారం. కాగా వీఆర్ఎస్ అమలు కోసం దాదాపు రూ. 15,000 కోట్లు అవసరమవుతాయి. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ కు వచ్చే ఆదాయంలో 38 శాతం అంటే సుమారు 7,500 కోట్లను జీతాలకే(Salaries) కేటాయిస్తోంది. ఈ వ్యయాన్ని రూ. 5,000 కోట్లకు తగ్గించాలన్నది ఆ సంస్థ ప్లాన్. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత వీఆర్ఎస్ ప్రక్రియ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై సంస్థ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ లో 55,000 మంది ఉద్యోగులున్నారు. కాగా తొలి విడత VRS ప్రక్రియకు మంచి స్పందన లభించడంతోనే బీఎస్ఎన్ఎల్ రెండో దశ స్వచ్చంధ పదవీవిరమణ పథకాన్ని అమలు చేయాలని చూస్తున్నట్లు పలువు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story