- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్ నోట హామీల వర్షం..
దిశ, మక్తల్ : 18 ఏళ్లు నిండిన ప్రతికోడళ్ళుకు సౌభాగ్యలక్ష్మి పేరున 3000 రూపాయలు సహాయం, తేల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికీ సన్న బియ్యం ఇస్తామని, మక్తల్ లో రెవెన్యూ డివిజన్, బస్టాండ్, గురుకులాలకు భవనాలు, నియోజకవర్గానికి ఉన్న అన్నిమార్గాలకు కొత్తరోడ్లు వేస్తామని మంత్రి కేటీఆర్ హామీల వర్షం కురిపించారు. అంతకుముందు చిట్టెం రామ్మోహన్ రెడ్డి గజమాలతో కేటీఆర్ ని సన్మానించారు. ఈ కార్నర్ సమావేశానికి పెద్ద మొత్తంలో ప్రజలు హాజరయ్యారు. జాతీయ రహదారి పై కార్నర్ సమావేశం జరగడంతో దాదాపు గంట పాటు ఇరువైపులా వందలాది వాహనాలు రాకపోకలు బంద్ కావడంతో అటు ప్రయాణికులు పలువాహనాల డ్రైవర్లు ఇబ్బందులు పడ్డారు. డిసెంబర్ 3 తారీఖున కొత్తగా 6 పథకాలని కేసీఆర్ ప్రారంభిస్తున్నారని దానివల్ల అన్ని వర్గాల వారికి లభించే రకంగా ఉంటుందని ఆయన అన్నారు. గురువారం రోజు సాయంత్రం అంబేద్కర్ చౌరస్తాలో జాతీయ రహదారి పై అంబేద్కర్ చౌరస్తాలో చిట్టి రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్నర్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఎంపీ మన్నేం శ్రీనివాస్ రెడ్డి, ఎన్నికల ఇంచార్జ్ కార్పొరేషన్ చైర్మన్ ఆంజనేయులు గౌడ్, సభ్యురాలు వివరాలు చిట్టెం సుచరిత, ఉద్యమ నేత స్త్రీ శిశు సంక్షేమ మాజీ చైర్మన్ లలితమ్మ, హాజరు కాగా అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధించాక అన్ని రంగాలలో అభివృద్ధి చేసింది కేసీఆర్ అని రైతులకు ఉచిత కరెంటు రైతుబంధు, కౌలు రైతులకు రైతు బీమా రైతుబంధు, వచ్చే రకంగా ఉంటాయన్నారు. అసైన్డ్ భూములను రెగ్యులర్ పట్ల మార్పు చేస్తామని. ధరణి వల్ల రైతులకు లబ్ధి చేకూరుస్తుందని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ధరణి రద్దుచేస్తే పట్వారి వ్యవస్థ తీసుకురావడం వల్ల దళారి వ్యవస్థ ఏర్పడుతుందని ఆయన అన్నారు. ఐదుకిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటకలో ప్రభుత్వం గెలిపించడం వల్ల రైతులు కరెంటు కష్టాల పాలయ్యారని ఆయన అన్నారు. మక్తల్ నియోజక వర్గంలో అన్నిరకాలుగా అభివృద్ధి చేయడానికి బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఓ పెద్ద లిస్ట్ నే ఇచ్చాడని వాటన్నిటిని తను పూర్తి చేయాలంటే భారీ మెజార్టీతో ఆయనని గెలిపించాలన్నారు.