17న పాలమూరు యూనివర్సిటీకి మందకృష్ణ రాక

by Naveena |
17న పాలమూరు యూనివర్సిటీకి మందకృష్ణ రాక
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ఈ నెల 17 న ఎంఆర్పీయస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాలమూరు యూనివర్సిటీకి రానున్నట్లు పీయూ మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు మీసాల గణేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన యూనివర్సిటీ లో మహాసభకు అనుమతి కోరుతూ..రిజిస్ట్రార్ కు వినతి పత్రాన్ని సమర్పించి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పును అమలు పరచకుండా జాప్యం చేస్తున్నందున నిరసనగా 17న మాదిగ విద్యార్థులతో పాలమూరు యూనివర్సిటీ లో మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొంటారని,జిల్లాలోని మాదిగ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీను, శేఖర్,దయాకర్,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed