దారుణం.. ఎత్తిపోతల సిస్టర్న్‌లో దూకి ప్రేమజంట ఆత్మహత్య

by Disha News Desk |
దారుణం.. ఎత్తిపోతల సిస్టర్న్‌లో దూకి ప్రేమజంట ఆత్మహత్య
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : వనపర్తి జిల్లా రేవల్లి మండలం గుడిపల్లి ఎత్తిపోతల సిస్టర్ను లో దూకి ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సంజయ్ నగర్ కు చెందిన నరేష్, కల్వకుర్తికి చెందినట్లుగా భావిస్తున్నా ఓ యువతి మధ్యాహ్నం సిస్టర్న్ దగ్గరకు మోటార్ సైకిల్ పై వచ్చి ఆగడాన్ని స్థానికులు గుర్తించినట్లు సమాచారం. సంఘటనా స్థలంలో చెప్పులు, మోటార్ సైకిల్, లేఖ ఉన్నట్లు సమాచారం.

ఇద్దరు సిస్టర్ను లోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న రేవల్లి పోలీసులు, గజ ఈతగాడు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు లేఖను స్వాధీనపరచుకొని వివరాలు సేకరిస్తున్నారు. కాగా నరేష్‌కు గతంలో వివాహం అయిందని, అతనికి భార్య ఏడాదిన్నర కూతురు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story