- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
గుత్తేదారులదే రాజ్యం..నష్టపోతున్న అన్నదాతలు
![గుత్తేదారులదే రాజ్యం..నష్టపోతున్న అన్నదాతలు గుత్తేదారులదే రాజ్యం..నష్టపోతున్న అన్నదాతలు](https://www.dishadaily.com/h-upload/2025/01/29/415921-4.webp)
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట జాతీయ వ్యవసాయ మార్కెట్‌లో గుత్తేదారుల రాజ్యం నడుస్తోందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. గత ప్రభుత్వంలో కూడా ఇదే సీజన్‌లో వేరుశనగ పంటకు మద్దతు ధర కల్పించడంలో మార్కెట్ అధికారులు, సిండికేట్ గుత్తేదారులు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని ఆందోళనలు చేశారు. గత ప్రభుత్వంలో నాడు అప్పటి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అరుణపై రైతులు దాడి చేసి నిలదీసిన ఘటన చోటుచేసుకుంది. అయితే ప్రస్తుత రబీ సీజన్ లో కూడా మార్కెట్‌లో వేరుశనగ పంటకు మద్దతు ధర ఇవ్వకుండా రైతులను నిండా ముచ్చుతున్నారని అన్నదాతలు మండిపడ్డారు. గత ఏడాది జరిగిన ఘటన మద్దతు ధర ప్రకటించకపోవడంతో రైతులు దాడి చేశారు. సోమవారం దాడి జరిగిన దాడికి ప్రధాన కారణం చైర్ పర్సన్ అంతటి రజితకు బదులుగా ఆమె భర్త మల్లేష్ రైతులతో దురుసుగా ప్రవర్తించడంతోపాటు ‘గిట్టుబాటు ధర గిట్లనే ఉంటది. ఇష్టముంటే అమ్మండి లేకపోతే లేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేయడంతో మార్కెట్ యార్డులో ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. చైర్ పర్సన్ భర్తతోపాటు మార్కెట్ సెక్రెటరీపై కూడా రైతులు దాడి చేసినట్లు సమాచారం.
గుత్తేదారులదే అసలు పాత్ర!
ఇంతవరకు ఒక విధానం అయితే.. అసలు రైతు పండించిన పంటకు గుత్తేదారులు వారికి తోచిన విధంగా ఎలా పడితే అలా మద్దతు ధర ప్రకటించడం వెనుక గుత్తేదారులు ప్రముఖ పాత్ర వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులు మార్కెట్‌లో ఏ పంటల తెచ్చిన మద్దతు ధర కోసం ఆందోళన చేపడితే అతి సునాయసంగా గుత్తేదారులు తమకేమీ తెలియదన్నట్టుగా, అసలు ఈ మార్కెట్‌తో సంబంధమే లేదన్నట్టుగా ముఖం చాటేస్తూ అంత సద్దుమణిగిన తర్వాత నెమ్మదిగా గుత్తేదారులు మార్కెట్ కార్యాలయానికి చేరుకొని రైతులదే తప్పన్నట్టుగా తప్పుదోవ పట్టిస్తున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇతర మార్కెట్లతో పోలిస్తే ఇక్కడనే ఎక్కువ ధరలు ఇస్తున్నామని ఓ తెల్ల కాగితంపై రేట్లు వేస్తూ అధికారులను, పోలీస్ యంత్రాంగాన్ని నమ్మిస్తూ వారు అనుకున్నట్టుగా తిమ్మిని బొమ్మి ని చేస్తున్నారు. ఇటు అధికారులు, మార్కెట్ కమిటీ నిర్వహణ ఏమి చెప్పినా వినకుండా వారు అనుకున్నది చేసి తీరుతారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కడుపు మంటతోనే దాడులా..?
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను రైతు మార్కెట్‌కు తెచ్చి మద్దతు ధరతో అమ్ముకునేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఈ క్రమంలో రైతన్నకు మద్దతు ధర ప్రకటించి మోసం చేయకండి మహా ప్రభువు అంటూ వ్యవసాయ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోతోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మద్దతు ధర లభించక, చివరికి చేసేది లేక రైతులు కడుపు మంటతో నిగ్రహాన్ని కోల్పోయి అధికారులపై కోపం కట్టలు తెంచుకుని దాడులకు పాల్పడే పరిస్థితులు దారితీస్తుందనేది నిజం. కానీ మార్కెట్ గుత్తేదారులు రైతన్నలను మోసం చేస్తూ రైతులు పండించిన పంట నాణ్యత లేదని మోసపూరిత మాటలు చెబుతూ మద్దతు ధర పెంచకుండ తక్కువ రేటు తో రైతుల కడుపు కొడుతున్నారు. ఈ క్రమంలో తమ పాత్ర ఏమాత్రం బయటకు కనిపించకుండా మార్కెట్ అధికార యంత్రాంగంపై తోసేస్తూ తమ చేతులకు మట్టి అంటకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలో మార్కెట్ అధికారులు కూడా గుత్తేదారుల మాయలో పడిపోయి రైతన్నలకు మేలు చేసే విషయాన్ని మర్చిపోతున్నారు. దీంతో మార్కెట్ లో గుత్తేదారులు ఆడింది ఆట పాడింది పాటగా తమ ప్రతాపాన్ని తెరవెనుక చూపుతూ తెర ముందు అధికారులను బలి చేస్తున్నారని జోరుగా చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో రైతులు మోసపోతుండగా గుత్తేదారులు మాత్రం లాభపడుతున్నారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ క్రమంలో గత ఏడాది జరిగిన ఘటనకు నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కారణమని నాటి ఎమ్మెల్యే, ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపణలు చేశారు. కాగా, అదే తరహాలో సోమవారం జరిగిన ఘటనకు ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే బాలరాజు ప్రధాన కారణమని ఎమ్మెల్యే ఆరోపణలు చేశారు. కాగా, ఇరువురు గుత్తేదారులు లాభపడుతుండగా ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతులు అటు అధికారులు, ప్రజాప్రతినిధులు, గుత్తేదారుల నడుమ పెద్దఎత్తున నష్టపోతున్నారనేది వాస్తవం.