Bird Flu Crisis: అమెరికాలో ఆకాశాన్నంటిన గుడ్ల ధరలు

by Shamantha N |
Bird Flu Crisis: అమెరికాలో ఆకాశాన్నంటిన గుడ్ల ధరలు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో కోడిగుడ్ల ధరలు (Egg Prices) ఆకాశాన్నంటాయి. ఇటీవలే ఎగ్స్ ధరలు 15 శాతం పెరగగా.. మరో 20 శాతం పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా వ్యాప్తంగా ఎగ్స్ లభ్యత (Eggs Shortage) భారీగా తగ్గడమే ఇందుకు కారణం. అనేక స్టోర్లలో ‘లిమిటెడ్‌ స్టాక్‌’ బోర్డులే కనిపిస్తుండగా.. కొన్ని చోట్ల ‘నో ఎగ్స్‌’ బోర్డులు దర్శనమిస్తుండటం గమనార్హం. . ధరలు పెరుగుతున్న దృష్ట్యా అధిక మొత్తంలో కొనుగోలు చేసేందుకు ప్రజలు యత్నిస్తున్నారు. దీంతో గుడ్ల విక్రయంపై పరిమితి విధిస్తున్న స్టోర్లు ఒక్కరికి గరిష్ఠంగా రెండు, మూడు ట్రేలు మాత్రమే ఇస్తున్నాయి. దీంతో వీటి కొనుగోలుపై సూపర్‌ మార్కెట్లు పరిమితి విధించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ట్రేడర్‌ జో వంటి స్టోర్లలో రోజుకు ఒకరికి డజను మాత్రమే ఇస్తుండగా.. హోల్‌ ఫూడ్స్‌ వంటి సంస్థలు మూడు కార్టన్‌లు, క్రోగర్‌ స్టోర్‌ రెండు డజన్లు తీసుకునేందుకు మాత్రమే అనుమతిస్తున్నాయి. ఈ పరిస్థితి హోటల్స్‌పై పడినట్లు తెలుస్తోంది. వాఫిల్‌ హౌస్‌ వంటి రెస్టారంట్లు ఒక్క ఎగ్ పై 50శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.

అమెరికాలో బర్డ్ ఫ్లూ కలకలం

అమెరికాలో కొంతకాలంగా బర్డ్‌ ఫ్లూ (Bird Flu) వ్యాప్తి విపరీతంగా పెరిగింది. దీంతో గతేడాది ఒక్క డిసెంబర్‌లోనే సుమారు 2.3కోట్ల కోళ్లను చంపేసినట్లు అమెరికా వ్యవసాయశాఖ గణాంకాలు పేర్కొన్నారు. ఒహాయో, మిస్సౌరీల్లో దీని ప్రభావం అధికంగా కనిపిస్తోంది. అమెరికా లేబర్‌ బ్యూరో లెక్కల ప్రకారం.. గతేడాది జనవరిలో డజను ఎగ్స్ ధర 2.52డాలర్లుగా ఉండగా.. డిసెంబర్‌ నాటికి అది 4.15 డాలర్లులకు పెరగింది. ప్రస్తుతం డజన్ ఎగ్స్ ని 7.34 డాలర్లుకు విక్రయిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎగ్స్ ధరలు మరింతగా పెరిగే ఛాన్స్ ఉందన్నారు.

Next Story

Most Viewed