నాగర్ కర్నూల్ జిల్లా పర్యాటక శాఖ అధికారిగా కల్వరాల నరసింహ

by Mahesh |
నాగర్ కర్నూల్ జిల్లా పర్యాటక శాఖ అధికారిగా కల్వరాల నరసింహ
X

దిశ, వీపనగండ్ల: నాగర్ కర్నూల్ జిల్లా పర్యాటక శాఖ అధికారిగా బాధ్యతలు ఇస్తూ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు,ప్రధాన అనుచరుడు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కల్వరాల నరసింహ ను నియమించారు. మంత్రి జూపల్లి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.స్థానిక సంస్థల ఎన్నికల వరకు పర్యాటక శాఖ అధికారిగా కల్వరాల నరసింహ పదవి బాధ్యతల్లో కొనసాగనున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఎంతో నమ్మకంతో ఈ పదవి బాధ్యతలు అప్పగించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కల్వరాల నరసింహ కు ప్రత్యేకంగా ఛాంబర్ కేటాయించనున్నారు. సోమశిల, ఉమ మహేశ్వరం, మల్లెల తీర్థం, అమ్రాబాద్, మన్ననూర్, శ్రీశైలం, నల్లమల అటవీ ప్రాంతం లాంటి పరిసరాల్లో పర్యాటక శాఖ బాధ్యతలు వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామవాసికి ప్రభుత్వం బాధ్యతలను అప్పగించడం పట్ల గ్రామస్తులు మండల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story