- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూల మలుపుల వద్ద ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని రాస్తారోకో..
దిశ, దామరగిద్ద: రోడ్డుపై మూలమలుపుల వద్ద జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని ముస్తా పేట్, దేశాయి పల్లి, అయ్యవారి పల్లి గ్రామాలకు చెందిన ప్రజలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారాయణ పేట నుంచి మద్దూరు డబుల్ రోడ్డు మీద ఉన్న దామరగిద్ద మండలం, అయ్యవారి పల్లి వద్ద ఉన్న మూలమలుపు వద్ద ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు జరగడం వల్ల చాలా మంది ప్రమాదాలకు గురై మరణించారని వాపోయారు.
సూచికబోర్డులు ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా వెంటనే సంబంధిత అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో వద్దకు దామరగిద్ద ఎస్ఐ శ్రీనివాస్ వచ్చి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. ఈ కార్యక్రమంలో అయ్యవారిపల్లి సర్పంచ్ రాఘవేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ అంజిలయ్య గౌడ్, ఉప సర్పంచ్ శివప్ప, వెంకటయ్య, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.