- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంచార్జి ఎంపీపీ భర్తపై దాడి..
దిశ, మిడ్జిల్: ఇంచార్జి ఎంపీపీ తిరుపతమ్మ భర్త రవి గౌడ్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన గురువారం మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల పరిధి బోయిన్ పల్లి గ్రామంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. బోయిన్ పల్లి గ్రామంలో ఓ ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ సందర్భంగా పంచాయతీ రోడ్డును ఆక్రమించి నిర్మాణ పనులు చేపడుతున్నారని, అలా చేయడం సరికాదని ఇంటి నిర్మాణదారులను రవి గౌడ్ హెచ్చరించారు. దీంతో ‘తాము గ్రామపంచాయతీ రహదారిని ఆక్రమించలేదు. గ్రామపంచాయతి రోడ్డుకు 9 ఇంచులు స్థలం వదిలేసి ఇల్లు నిర్మాణం చేస్తున్నాం. అయినా దీనిపై ప్రశ్నించాల్సింది పంచాయతీ సెక్రటరీ, గ్రామ సర్పంచ్ లు. నీకు సంబంధం లేని విషయంలో అనవసరంగా తమ ఇంటి నిర్మాణం వద్దకు వచ్చి రాద్ధాంతం చేస్తున్నావు’ అంటూ ఇంటి నిర్మాణదారులు రవి గౌడ్ తో వాదనకు దిగారు.
ఇంటి నిర్మాణదారుడైన సురేష్, రవి గౌడ్ మధ్య మాట మాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో సురేష్ పార తీసుకొని రవి గౌడ్ కనతపై కొట్టాడు. దీంతో రవి గౌడ్ తీవ్రంగా గాయపడి కింద పడిపోయాడు. స్థానికులు హుటాహుటిన మిడ్జిల్ మండల కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కొరకు రవి గౌడ్ ను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఇరువురు మిడ్జిల్ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు.