- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాత పెన్షన్ విధానం అమలు చేయండి..
దిశ, ప్రతినిధి నారాయణపేట: సామాజిక భద్రత కోసం పాత పెన్షన్ విధానం అమలు చేయాలని టీఎస్ సీపీఎస్ యూ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నారాయణపేట జిల్లా కేంద్రంలో సీపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల నిరసన ర్యాలీని మున్సిపల్ పార్క్ నుంచి పాత బస్టాండ్ మీదుగా సత్యనారాయణ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు.
అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన సమావేశంలో సంఘం బాధ్యులు మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానం వల్ల ఉద్యోగులలో అభద్రతాభావం నెలకొన్నదని తెలిపారు. వీలైనంత త్వరగా సీపీఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీంని ప్రవేశపెట్టాలని కోరారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాఘవేంద్ర చారి, ట్రెజరర్ రాజేందర్ రెడ్డి, విద్యాసాగర్, కృపాకర్ రెడ్డి, శంకర్, వెంకటరెడ్డి, శ్రీనివాస్, మల్లేష్, రాజగోపాల్, శివశంకర్, నాగరాజు, తిరుపతి నాయక్, వివిధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు యశ్వంత్, జనార్దన్ రెడ్డి, బాలాజీ, లక్ష్మారెడ్డి, అరుణ, శ్రీదేవి, రాధిక, కృష్ణవేణి, జానకి తదితరులు పాల్గొన్నారు.