- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజాయితీని చాటుకున్న వస్త్ర దుకాణం యాజమాని..
దిశ, ప్రతినిధి నారాయణపేట: నేటి కాలంలో ఎవరికైనా సులభంగా ఏదైనా వస్తువు దొరికినా.. డబ్బులు దొరికిన మూడో కంటికి కనిపించకుండా దాచుకోవడం మనం చూస్తుంటాం. కానీ నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన వస్త్ర దుకాణం యాజమాని తనది కాని వస్తువును తాను తీసుకోకుండా నిజాయితీని చాటుకొని తన షాపులో మర్చిపోయిన సుమారు రెండు తులాల బంగారం వస్తువుని తిరిగి బాధితులకు అప్పగించారు.
కర్ణాటక రాష్ట్రం గురుమిట్కల్ తాలూకా దేవర పల్లి గ్రామానికి చెందిన బసప్ప కుటుంబ సభ్యుల వివాహం ఉన్నందున దుస్తులు కొనేందుకు పాత బస్టాండ్ సమీపంలోని ఏఏ గార్మెంట్స్ వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో బసప్ప వస్త్ర దుకాణంలో బంగారు వస్తువులతో కూడిన పాకెట్ ను మర్చిపోయాడు. వెంటనే దుకాణ యజమాని స్పందించి నిజాయితీతో తిరిగి బసప్పకు నారాయణపేట పోలీస్ స్టేషన్ లో బంగారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సురేష్ గౌడ్ నిజాయితీని చాటుకున్న షకీల్ ను శాలువాతో సత్కరించారు.