నాకు ఘనంగా స్వాగతం పలకాలే.. అచ్చంపేట అంతా హల్చల్ గావాలే: గువ్వల బాలరాజ్ (వీడియో)

by S Gopi |   ( Updated:2023-04-01 17:55:18.0  )
నాకు ఘనంగా స్వాగతం పలకాలే.. అచ్చంపేట అంతా హల్చల్ గావాలే: గువ్వల బాలరాజ్ (వీడియో)
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: నేను అచ్చంపేటకు వస్తున్న సందర్భంగా ప్రతిపక్షాలకు భయం కలిగేలా మీ స్వాగతం ఉండాలి.. సహకరించనివారికి ఏ విధంగా నేను సహకరించాలో మీతో కలిసి నిర్ణయం తీసుకుంటా... అంటూ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యానాలు సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తున్నాయి. ఫామ్ హౌస్ వ్యవహారాల అనంతరం గత 32 రోజులుగా హైదరాబాద్ కి పరిమితమై ఉన్న అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇటీవల హైదరాబాదులో తన ముఖ్య అనుచరులతో సమావేశం నిర్వహించి చేసిన వ్యాఖ్యానాలు దుమారం రేపుతున్నాయి. 'ఈ సండే నేను అచ్చంపేటకు వస్తున్నా .. 1000 బైకులతో ర్యాలీ జరగాలి. ప్రతి ఊరి నుండి 50 నుండి 100 బైకులు రావాలి. ఇందుకు పెద్ద నాయకులంతా బాధ్యత తీసుకోవాలి. సహకరించనివారికి నేను ఏ విధమైన సహకారం చేయాలో మీ అందరితో కలిసి నిర్ణయం తీసుకుంటా' అంటూ చేసిన వ్యాఖ్యానాలు ఒక విధమైన బెదిరింపులేనని అచ్చంపేటలో చర్చ జరుగుతోంది.

'మీకు ఇచ్చిన హామీ మేరకు ఉమామహేశ్వర- చెన్నకేశవ, రిజర్వాయర్లకు శంకుస్థాపన జరిగి తీరుతుంది. ఇంతకుముందు ప్రతి వంద మంది ఓటర్లకు ఒక ఇన్చార్జి ఉండేది. ఇప్పుడు డబుల్ పెడదాం అని వ్యాఖ్యానించారు. ర్యాలీకి 500 నుండి 1000 మంది బంజారా మహిళలు వారి సాంప్రదాయ దుస్తులతో రావాలి. మహిళల కోలాటాలు.. బతుకమ్మలు ... బొడ్డెమ్మలు, డోలు... డప్పులతో అచ్చంపేట అంతా హల్చల్ గావాలే... అట్లాగే 50 నుండి 100 మంది చెంచులను వారి సాంప్రదాయ దుస్తులతో తీసుకురావాలి. నాకు ఓ కోరిక ఉంది. చెంచులు ఎక్కువ పెట్టే బాణం నా చేతికి ఇవ్వండి. నేను ప్రజాస్వామ్యాన్ని కూని చేసేలా వ్యవహరిస్తున్న బీజేపీ, తదితర పార్టీలకు దడపుట్టేలా బాణం ఎక్కువ పెడుతా.. ఆ దృశ్యం టీవీలు, సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేయాలి. అట్లనే ఆ మధ్య మనం వెయ్యి మంది నిరుద్యోగ యువతకు మనం భోజనం పెట్టి శిక్షణ ఇచ్చినం. వారి అందరినీ కూడా కార్యక్రమానికి తీసుకురావాలి' అని పార్టీ శ్రేణులకు గువ్వల బాలరాజు ఆదేశాలు జారీ చేశారు. గువ్వల నిజంగానే నిజాయితీగా వ్యవహరించాడు అంటే ప్రజల సంగతి అటు ఉంచితే పార్టీ నాయకులు, కార్యకర్తలు... వారే స్వయంగా కార్యక్రమాలను రూపొందించుకుని ఘన స్వాగతం పలుకుతారు.. కానీ తనకు ఘన స్వాగతం పలకాలని... అచ్చంపేట అంతా హల్చల్ కావాలని.. ఒక విధంగా ప్రతిపక్షాల నాయకులకు భయం కలిగేలా కార్యక్రమాలు జరగాలన్నట్లుగా గువ్వల తన పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడిన విధానం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed