- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రూప్ -3 పరీక్షలు సజావుగా నిర్వహించాలి
దిశ నాగర్ కర్నూల్ : గ్రూప్ -3 పరీక్ష సజావుగా నిర్వహించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-3 పరీక్ష నిర్వహణకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫిసర్, రూట్ ఆఫిసర్లు, ఫ్లయింగ్ స్వ్కాడ్, పోలీస్ అధికారులతో శిక్షణ తరగతులను నిర్వహించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-3 పరీక్ష కోసం నాగర్ కర్నూల్ జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంతో పాటు, బిజినపల్లి, తెలకపల్లి మండల కేంద్రాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 33 సెంటర్లలో 9478 మంది అభ్యర్థులు గ్రూప్ 3 పరీక్ష వ్రాయనున్నట్లు తెలిపారు. నవంబర్ 17న ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు హిస్టరీ- పాలిటి - సోసైటి పేపర్-2, నవంబర్ 18న ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు ఎకానమీ డెవలప్ మెంట్ పేపర్ -3 పరీక్షలు నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పరీక్ష సమయానికి అరగంట ముందే పరీక్ష కేంద్రం గేటు మూసి వేస్తారని తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్ష కేంద్రంలోనికి అనుమతించాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారు, వెండి అనుమతి లేదన్నారు. సాధారణ చేతి గడియారం మాత్రమే అనుమతి ఉందన్నారు. కంటి చూపు లేని వారికి టీజీపీఎఎస్సీ మార్గదర్శకాలకు అనుగుణంగా స్క్రైబ్ ఇవ్వడం జరుగుతుంది అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పి రామేశ్వర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శర్మ,తదితరులు పాల్గొన్నారు.