దేవరకద్రలో ఘనంగా పడిపూజ మహోత్సవం

by Naveena |
దేవరకద్రలో ఘనంగా పడిపూజ మహోత్సవం
X

దిశ,దేవరకద్ర: దేవరకద్ర నియోజకవర్గ కేంద్రం ఆదివారం అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగింది. దేవరకద్ర పట్టణంలోని చెన్నకేశవ స్వామి దేవస్థానం దగ్గర నారికేల గురుస్వామి బాలరాజు ఆధ్వర్యంలో..అయ్యప్ప స్వామి 18వ మహా పడిపూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామిని రకరకాల పూలతో,పండ్లతో అలంకరించారు. దేవరకద్ర పట్టణమంతా భక్తి భావంతో, అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. వందల సంఖ్యలో అయ్యప్ప స్వాములు పూజకు హాజరై అయ్యప్ప స్వామికి భజనలతో కీర్తనలతో ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వాములు ఆయనకు తీర్థప్రసాదాలు ఇచ్చి..శాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed