- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాగునీటి రంగానికి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే అబ్రహం
దిశ, ఉండవల్లి: సమైక్య రాష్ట్ర పాలనలో రైతులకు సాగునీరు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని సాగునీటి రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. అలంపూర్ చౌరస్తాలో వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం సాగునీటి దినోత్సవ కార్యక్రమం సంబంధిత శాఖ అధికారులు ఎమ్మెల్యే అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్డీఎస్ ద్వారా పంటలకు రావాల్సిన నీటి వాటా రాక రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని నేడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి కష్టాలు తీరాయని అన్నారు.
రైతులు ఇబ్బందులు, కష్టాలు పడి పంటలు ఎండిపోయి, పంటలకు పెట్టుబడులు రాక రైతు కూలీలు వలస కూలీలుగా మారి బతుకుదెరువు కోసం హైదరాబాద్, మహారాష్ట్ర, వివిధ ప్రాంతాలకు వలస వెళ్లేవారని నేడు తెలంగాణ ఏర్పడిన తర్వాత వెలుగులు జిలుగుల తెలంగాణ ఏర్పడిందని కరెంట్ కష్టాలు లేవు, నీటి సమస్యలు లేవని ఎమ్మెల్యే అన్నారు. అలంపూర్ నియోజకవర్గంలో సాగునీటి రంగంలో రైతుల ఎదుర్కొంటున్నా ఇబ్బందులు గుర్తించి సీఎం కేసీఆర్ మల్లమ్మ కుంట రిజర్వాయర్ మంజూరు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ, ఆలయ చైర్మన్ చిన్న కృష్ణయ్య, జడ్పీటీసీ రాజు ఎంపీపీ బీసమ్మ, ఇరిగేషన్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.