- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వామ్మో హాస్టల్ భోజనమా.. జంకుతున్న స్టూడెంట్లు..!
దిశ, అచ్చంపేట: ఉమ్మడి పాలమూరు జిల్లాల్లోని ప్రభుత్వానికి సంబంధించిన హాస్టళ్లలో వరుసగా ఫుడ్ ఫాయిజన్ అవుతున్నాయి. దీంతో విద్యార్థులు ఆస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఇటీవల ప్రభుత్వ ప్రైవేటు వసతి గృహాలలో విద్యార్థులకు వరుసగా ఫుడ్ పాయిజన్ అవుతోంది. దీంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్న కోస్గిలో ఓ ప్రభుత్వ వసతి గృహంలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఆ సంఘటన మరువకముందే, నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం పెంట్లవెల్లి లో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో సుమారు 40మంది విద్యార్థులలు అస్వస్థతకు గురయ్యారు. జిల్లా కలెక్టర్ ఎస్ఓతో పాటు ఐదుగురిపై వేటు పడింది.. ఈ నెల 7న బుధవారం జడ్చర్లలో మైనార్టీ గురుకుల పాఠశాలలో 42 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. కాగా, 08న గురువారం అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలోని లింగోటం వద్ద ఉన్న ప్రైవేటు ఆక్స్ఫర్డ్ బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో సుమారు 32మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది.
పనిచేయని ఆర్ఓ ప్లాంట్స్..
వసతి గృహాలలో విద్యార్థులు కలుషిత నీరు తీసుకోకుండా ఉండాలంటే ఆర్వో ప్లాంట్స్ తప్పకుండా ఉండాలి. కొన్ని వసతి గృహాలకు ప్రభుత్వం ఆర్వో ప్లాంట్స్ మంజూరు చేసినా, అందుల 90 శాతం ఆర్వో ప్లాంట్లు పనిచేయడం లేదు. వాటిని తిరిగి అధికారులు మరమతుల చేసిన పాపాన పోలేదు. వర్షాకాలంలో విద్యార్థుల ఆరోగ్య తప్పకుండా విద్యార్థులకు వసతి గృహాలలో గోరువెచ్చని నీరు అందించాలని నిబంధనలు ఉన్నా, ఎక్కడ కూడా అది అమలుకు నోచుకోవడం లేదు.
ఫుడ్ పాయిజన్ కారణం ఇదేనా ?
అచ్చంపేట మండలం లింగోటం వద్ద ఉన్న ఆక్స్ఫర్డ్ ప్రైవేటు బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో గురువారం ఫుడ్ పాయిజన్ కావడానికి ప్రధాన కారణం ఉదయం విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ ఫుడ్ అందించిన చపాతీలు మైదాపిండి కలవడం. అవి కూడా పూర్తిగా డ్రైకావడమే అని వైద్యులు ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న స్థానిక వైద్యులతో పాటు డీఎస్పీ శ్రీనివాసులు ఆక్స్ఫర్డ్ స్కూల్ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు వడ్డించే ఆహార పదార్థాలను పరిశీలించారు.
నీటిలో బ్యాక్టీరియా వేగంగా వ్యాప్తి..
పాత నీరు పోయి కొత్తనీరు ఇచ్చిన సందర్భంగా నీటిలో బ్యాక్టీరియా మరింత వేగంగా వృద్ధి చెంతుంది. దీంతో కలుషిత నీరు ఆహారం తీసుకోవడంతో డయేరియా స్టమక్ పెయిన్, వాంతులు విరోచనాలతో అనారోగ్య సమస్యలు ఏర్పడతున్నాయి.
పర్యవేక్షణ లోపమే కారణం..
ఇటీవల ప్రభుత్వ ప్రైవేటు వసతి గృహాలలో ఫుడ్ పాయిజన్ అయిన సంఘటనలు ఉమ్మడి జిల్లాలో చోటుచేసుకుంటుండతంతో, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల వసతి గృహాలపై జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షించాలాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటివరకు ఎక్కడ కూడా ప్రైవేట్ పాఠశాలల వసతి గృహాలలో ఉన్నత అధికారులు ఎక్కడ తనిఖీ చేసిన సందర్భాలు లేవని అందుకు అధికారుల లోపాలు కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయని విమర్శలు వెలువెత్తుతున్నాయి.
చల్లని పదార్థాలు తీసుకోవద్దు
వర్షాకాల సీజన్లో నీటిలో బ్యాక్టీరియా వేగంగా వ్యాప్తి చెందుతుంది. కలుషిత నీరుతో డయేరియా కడుపునొప్పి వాంతులు విరేచనాలు కలుగుతాయి. దీంతో పాటు వసతి గృహాలలో పరిశుభ్రత, నాణ్యమైన కూరగాయతో కూడిన భోజనం, తప్పకుండా ఆర్ఓ ప్లాంట్స్ ఉండాలి. ఏ పూటకు ఆ పూట వేడివేడి ఆహారం అందించినట్లయితే ఫుడ్ పాయిజన్ కాకుండా నివారించొచ్చు.
- మహేష్, డాక్టర్, అచ్చంపేట