Collector : రైతులు ఆధునిక పద్ధతులలో లాభసాటి వ్యవసాయంను అలవర్చుకోవాలి

by Kalyani |
Collector : రైతులు ఆధునిక పద్ధతులలో  లాభసాటి వ్యవసాయంను అలవర్చుకోవాలి
X

దిశ,వనపర్తి : రైతులు ఆధునిక పద్ధతులలో లాభసాటి వ్యవసాయంను అలవర్చుకునేలా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులను వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని గ్రోమోర్ ఫెర్టిలైజర్ షాపును జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుధాకర్ రెడ్డి తో కలిసి పరిశీలించారు. గ్రోమోర్ లో కొనుగోలు చేసేందుకు వచ్చిన రైతులతో రైతులకు ఇవన్నీ మీకు ఎవరు చెప్పారు? మీ వ్యవసాయ విస్తరణాధికారి మీకు సలహాలు సూచనలు ఇచ్చారా? అని వాకబు చేశారు. వ్యవసాయ విస్తరణాధికారులు రైతులకు అందుబాటులో ఉండి సలహాలు సూచనలు ఇవ్వాలని,మండల వ్యవసాయ అధికారులు మండల స్థాయి సమావేశాలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అనంతరం ఎరువుల నిల్వలు, రిజిస్టర్ పరిశీలించారు. రిజిస్టర్ లో ఉన్న నిల్వలు ఈ పాస్ యాప్ లో ఉన్న నిల్వలతో సరిచూశారు. అనంతరం పానగల్ మండలం అన్నారం గ్రామం చేరుకొని అక్కడ రైతులతో వ్యవసాయ విస్తరణాధికారి క్రాప్ బుకింగ్ చేస్తున్న ప్రక్రియను పరిశీలించారు. పానగల్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ గర్భిణీలు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వైద్య అధికారులను ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించాల్సిన రిజిస్టర్లు పూర్తిస్థాయిలో లేకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతి గర్భిణీ మహిళకు మొదటి త్రైమాసికంలోనే ఎ.ఎన్.సి. పరీక్షలు చేసి ఆన్లైన్ తో పాటు రిజిస్టర్లో నమోదు చేయాలని, సుమారుగా ప్రసవం జరిగే తేదీలను సైతం నమోదు చేయాలని సూచించారు.రోజుకు ఎంతమంది ఒ .పి లు వస్తున్నారు,టి. హబ్ వాహనం ఎన్ని గంటలకు వస్తుంది, రక్త పరీక్షల రిపోర్టు ఎప్పుడు ఇస్తున్నారు వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. మందుల నిలువలు పరిశీలించి ఏమైనా లోటు ఉందా అని అడిగి తెలుసుకున్నారు. ప్రసూతి గదిలో మౌలిక సదుపాయాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆసుపత్రి ఆవరణలో మొక్కను నాటారు.

అమ్మ ఆదర్శ పాఠశాల పనులు త్వరగా పూర్తి చేయాలి

పానగల్ మండలం అన్నారం తండాలో ప్రాథమిక పాఠశాలను సందర్శించిన కలెక్టర్ అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించారు. పనులునాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ జయచంద్ర మోహన్,డిప్యూటీ డిఎంఅండ్ హెచ్ ఓ డాక్టర్ సాయినాథ్ రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ పరిమళ,వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed