- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధాన్యం కొంటలేరని 167వ జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో
దిశ, జడ్చర్ల : రైతు పండించిన ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేయడం లేదని.. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే గోదాంలకు తరలించాలని కోరుతూ.. 167 వ జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టి ఆందోళనకు దిగారు. జడ్చర్ల పట్టణంలోని పత్తి మార్కెట్ యార్డులో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కాటన్ మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్న 167 వ జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. గత నెల రోజులుగా పత్తి కాటన్ మార్కెట్ యార్డ్‌కు రైతులు తెచ్చిన ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేయడం లేదని కొంతమంది వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా గోదాములకు తరలించకపోవడంతో వర్షాలు పడి ధాన్యం తడిసిన రైతులదే బాధ్యత ఉంటుండడంతో అకాల వర్షానికి ధాన్యం తడిసి అపార నష్టం వాటిల్లుతుందని అధికారుల తీరు పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులు వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోదాములకు తరలించాలని డిమాండ్ చేస్తూ.. రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. సుమారు రెండు గంటల నుండి జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టర్ వచ్చి రైతులకు హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని బిస్మించుకొని కూర్చున్నారు. కాగా నేడు తెలంగాణ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ వారోత్సవాలు నిర్వహిస్తున్నందున పోలీస్ సిబ్బంది మొత్తం ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్లడంతో ఆందోళన చేపట్టే స్థలం వద్దకు పోలీసులతో పాటు ఏ శాఖ అధికారులు. రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఎమ్మెల్యే హామీతో ఆందోళన విరమించిన రైతులు..
ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి తెలియడంతో ఆందోళనకారులతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడుతూ.. గంట సేపట్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు లారీలను పంపిస్తానని కొనుగోలు చేయని ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే విధంగా అధికారులతో మాట్లాడుతానని రైతులకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
Read More: ఊహించని రీతిలో బెడిసికొట్టిన సర్కార్ ప్రతిష్టాత్మక నిర్ణయం.. అరిగోస పడుతున్న లక్షలాది రైతులు!