సీపీఆర్ పై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం: జడ్పీటీసీ అనంత ప్రతాప్ రెడ్డి

by Kalyani |   ( Updated:2023-04-24 10:52:34.0  )
సీపీఆర్ పై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం: జడ్పీటీసీ అనంత ప్రతాప్ రెడ్డి
X

దిశ, ఉప్పునుంతల: సీపీఆర్ పై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని జడ్పీటీసీ అనంత ప్రతాప్ రెడ్డి అన్నారు. ఉప్పునుంతల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో రైతు వేదికలో డాక్టర్ శ్యాం ప్రసాద్ రెడ్డి సీపీఆర్ పైన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్యాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. సడెన్ కార్డియాక్ అరెస్ట్ అనేది గుండె లయ అపక్రమంగా మారడం కారణంగా గుండె పనులు ఆకస్మికంగా కోల్పోవడం వల్ల శ్వాస ఆగిపోతుందన్నారు.

కావున తక్షణమే సీపీఆర్ చేయడంలో భాగంగా 30 సార్లు చాతి వద్ద నొక్కడం, నోటి నుంచి రెండు శ్వాసలు ఒకదాని తర్వాత ఒకటి ఇవ్వాలని ఇలా చేస్తే శరీరమంతా ఆక్సిజన్ తో కూడిన రక్తాన్ని ప్రసరింప చేయడానికి సహాయపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరుణ నరసింహారెడ్డి, జడ్పీటీసీ అనంత ప్రతాపరెడ్డి, స్థానిక సర్పంచ్ సరిత అనంతరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ భూపాల్ రావు, ఎస్ఐ శేఖర్ గౌడ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ తారా సింగ్, వైద్యాధికారి డాక్టర్ స్వప్న, ఫార్మసిస్ట్ శ్రీనివాసులు, క్లస్టర్ సిబ్బంది అశోక్ ప్రసాద్, ఓ శ్రీను, సూపర్ వైజర్లు శంకరమ్మ, ప్రభావతిలతో పాటు ప్రజాప్రతినిధులు, ఏఎన్ఎం, ఆశాలు, అంగన్వాడీ టీచర్లు, రెవెన్యూ, పంచాయతీరాజ్ విద్యాశాఖ, పోలీస్ శాఖ, ఫ్రంట్ లైన్ వర్కర్లు,హెల్త్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Next Story

Most Viewed