ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి చూపాలి: ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

by Aamani |
ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి చూపాలి: ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
X

దిశ, పెబ్బేరు: తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక గత ప్రభుత్వ పాలనలో పదేళ్లపాటు విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిందనీ బుధవారం పాఠశాల స్థాయి విద్యార్థుల క్రీడల పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే తూడి మేఘ రెడ్డి అన్నారు. పెబ్బేరు మండల కేంద్రంలో చేపట్టిన పలు కార్యక్రమాలకు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి తో పాటు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి మండల కేంద్రంలో ఒక ఎడ్యుకేషన్ ఇంటిగ్రేటెడ్ హబ్ ను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రీడాకారిణి సౌమ్యను సన్మానించారు.

వనపర్తి ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న కాలంలో ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడలపై దృష్టి సారించాలని క్రీడలతోనే ఉన్నత స్థాయి గుర్తింపు వస్తుందని ఆయన అన్నారు. అంతకుముందు జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని 56 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కరుణశ్రీ సాయినాథ్, వైస్ చైర్మన్ కర్ర స్వామి, తహసీల్దార్ లక్ష్మి, ఎంపీడీవో రవీంద్ర, ఎంఈఓ జయరాములు, హై స్కూల్ హెచ్ ఎం రఘు వర్ధన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గౌడ్ , సురేందర్ గౌడ్, వెంకటేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed