- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA : అచ్చంపేటలో విద్యాసంస్థల ఏర్పాటు ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యం
దిశ, అచ్చంపేట/ ఉప్పునుంతల : అచ్చంపేట నియోజకవర్గంలో విద్యా సంస్థల ఏర్పాటు ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో... నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మొదటి విడత పైలట్ ప్రాజెక్టులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేసినందుకు నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం కోసం జిల్లాలోని ఉప్పునుంతల మండలం రాయి చెడ్ గ్రామ శివారులో శిలాఫలకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే, ఎంపీ మాట్లాడుతూ.. అచ్చంపేట ప్రాంతంలో విద్య, ఉపాధి, ఇరిగేషన్ ఇండస్ట్రీస్ లకే నా మొదటి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. స్వర్గీయ మహేంద్ర నాథ్ ను ఆదర్శంగా తీసుకొని నల్లమల్ల ప్రాంతాన్ని, అచ్చంపేట ను అభివృద్ధి చేసేందుకు శక్తి వచనం లేకుండా పనిచేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ గురుకులాలను ఒకేచోట నిర్మించి మినీ ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్థి చేయాలని, అప్పుడు గురుకులాల నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ మరింత సమర్థంగా నిర్వహించే వీలుంటుందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
అంతకుముందు అచ్చంపేట పట్టణంలో శుక్రవారం రాత్రి నల్లమల్ల మ్యూజికల్ నైట్ కార్యక్రమం ఏర్పాట్లను ఎమ్మెల్యే ఎంపీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ లాయర్ రాజేందర్, ఉమామహేశ్వర ఆలయ చైర్మన్ మాధవరెడ్డి, నాయకులు కట్ట గోపాల్ రెడ్డి, రామనాథం, సీఎం రెడ్డి, కాశన్న యాదవ్, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.