- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
child labor : ఆపరేషన్ ముస్కాన్ తో బాలకార్మికుల విముక్తి..
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ -10 కార్యక్రమంతో ముస్కాన్ టీం నిర్వహించిన ఆపరేషన్ ద్వారా 58 మంది బాల కార్మికులకు విముక్తి లభించిందని జిల్లా ఎస్పీ జానకి ఒక ప్రకటనలో తెలిపారు. గత జూలై మాసంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా తప్పిపోయిన పిల్లలతో పాటు, బాల కార్మికులుగా పని చేస్తున్న చిన్నారులు, అక్రమ రవాణాకు గురైన పిల్లలను గుర్తించి, వారిని రక్షించి పునరావాసం కల్పించినట్లు ఎస్పీ తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా లేబర్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఎన్జీవోలు, పోలీస్ అధికారులతో కలిసి ఒక టీంగా ఏర్పడి, జిల్లాలోని వివిధ ప్రాంతాలు, గ్రామాల్లో పర్యటించి 58 మంది బాల కార్మికులకు గుర్తించి రిస్క్ చేయడం గొప్ప విషయమని వారిని ఆమె అభినందించారు. విముక్తి లభించిన చిన్నారులకు విద్య, పునరావాసం కల్పించేలా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించామని ఎస్పీ వివరించారు.