- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల నోడల్ అధికారులు పూర్తి అవగాహనతో విధులు నిర్వర్తించాలి - జిల్లా ఎన్నికల అధికారి
దిశ నాగర్ కర్నూల్ కలెక్టరేట్:- జిల్లాస్థాయి ఎన్నికల నోడల్ అధికారులు పూర్తి అవగాహనతో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి ఉదయ్ కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, అంచనాలు, మానిటరింగ్ కమిటీ, స్వీప్, పోస్టల్ బ్యాలెట్, మ్యాన్ పవర్, ట్రైనింగ్ నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ......
నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. ఎన్నికల్లో అభ్యర్థి రూ.40లక్షలకు మించి ఖర్చు చేయరాదని ఎన్నికల సంఘం పరిమితి విధించినట్టు తెలిపారు. సోషల్ మీడియా పై నిఘా ఉంచాలని తెలిపారు .ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు కుమార్ దీపక్, సీతారామారావు, నోడల్ అధికారులు నర్సింగ్ రావు, ఉష, పత్యా నాయక్, శ్రీనివాసులు, శ్రీనివాస్ బాబు, రమాదేవి, ఫయాజుద్దీన్, రిటర్నింగ్ అధికారులు వెంకట్ రెడ్డి, గోపిరామ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామ్ రెడ్డి, జాకీర్ అలీ, కార్తీక్, చంద్రశేఖర్, ఎం సి ఎం సి కమిటీ సభ్యులు శ్రీధర్, దినకర్, తిరుపతయ్య, గురుబ్రహ్మం, శ్రీకర్, తదితరులు పాల్గొన్నారు