- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటి నుంచి గెంటేసిన కొడుకులు.. చెట్టుకింద దీనావస్థలో వృద్ధురాలి మృతి
దిశ, అచ్చంపేట : మానవత్వం మంటకలిసిపోతోంది అనడానికి అప్పుడప్పుడు జరుగుతున్న కొన్ని ఉదాహరణలే నిదర్శనం. కన్న తల్లి అని కూడా చూడకుండా ఇంటి నుంచి గెంటేశారు కొడుకులు. కూతుర్లు అదే ఊరిలో ఉన్నా సరే పట్టించుకోలేదు. దాంతో చెట్టుకిందనే దీనావస్థలో ఉంటూ.. ఎండకు, చలికి, వానకు ఓర్చుకోలేక చివరకు చివరకు చనిపోయింది. అయినా సరే ఆ వృద్ధురాలి శవం దగ్గరకు కొడుకులు, కూతుర్లు దగ్గరకు రాలేదు. ఈ దుర్భరమైన అమ్రాబాద్ మండలం తిర్మలాపూర్ (బికె) గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మిద్దె అంబమ్మ (78) గురువారం దయాణక స్థితిలో మృతి చెందింది. గత మూడు రోజుల క్రితం గ్రామంలోనే ఉన్న ముగ్గురు కొడుకులు ఇంటి నుండి వెలివేయడంతో గ్రామంలోని ఓ చెట్టుకిందే జీవనం గడిపిందని.. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తట్టుకోలేక గురువారం తెల్లవారు జామున ఆమె మృతి చెందిందని గ్రామస్తులు తెలిపారు. తల్లి చనిపోయిందని తెలిసినా కూడా కుమారులు కూతురు మృతదేహం దగ్గరికి రాలేదని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో గ్రామస్థులు అమ్రాబాద్ పోలీసులకు పిర్యాదు చేశారు.