- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మౌలిక వసతుల కల్పనకు కృషి: మంత్రి నిరంజన్ రెడ్డి
దిశ, వనపర్తి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి మండలంలో మంత్రి పర్యటించి 3.34 కోట్ల రూపాయల అభివృద్ధి మనులకు శంకుస్థాపనలు చేశారు. తూర్పు తండాలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయతీ భవనానికి, చిట్యాల నుంచి పడమటి తండా వరకు రూ. 43 లక్షల వ్యయంతో బీటీ రోడ్డుకు, అచ్యుతాపూర్ నుంచి చిట్యాల వరకు రూ.1.70 కోట్ల వ్యయంతో వేయనున్న బీటీ రోడ్డుకు, పాపాగని తండా రూ. 54 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు.
చందాపూర్ పంచాయతీ రాజ్ రోడ్డు నుంచి పెద్ద తండా వరకు రూ. 47 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు తండాలు, గూడెంలను గ్రామపంచాయతీలుగా మార్చడం జరిగిందని, తద్వారా తమ ఊరి అభివృద్ధి తామే చేసుకునే విధంగా పరిపాలన సౌలభ్యం కల్పించిందని తెలియజేశారు. తండాలు, గూడెంలలో అవసరమైన మౌలిక సదుపాయాలు విద్యుత్, రోడ్లు, పాఠశాలలు, డ్రైనేజీలు, మిషన్ భగీరథ ద్వారా తాగునీరు తదితర అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఈఈ మల్లయ్య, మండల అభివృద్ధి అధికారి, సుదర్శన్, ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులు ఎన్. లక్ష్మణ్, శారద తదితరులు పాల్గొన్నారు.