లారీల కొరతతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల పడిగాపులు..

by Kalyani |
లారీల కొరతతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల పడిగాపులు..
X

దిశ, కొత్తపల్లి: రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. కేంద్రాలలో ధాన్యం తూకాలు చేసి లారీలో లోడ్ చేసే వరకు రైతులదే బాధ్యత అని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెబుతుండడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మద్దూరు, కొత్తపల్లి మండలాలలో 24 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.

సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లకు తరలించేందుకు లారీలు సకాలంలో రాకపోవడంతో ఇదు రోజుల పాటు రైతులు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు రోజూ వారీగా సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed