అచ్చంపేట గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డ

by Mahesh |
అచ్చంపేట గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డ
X

దిశ, అచ్చంపేట: స్వరాష్ట్రంలో వరుసగా రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని కొనసాగించి నప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను పూర్తిస్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్లే క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం సూచనలను కిందిస్థాయి అభ్యర్థులు తమదైన శైలిలో తీసుకెళ్లే ప్రయత్నంలో విజయవంతం అయ్యారని చెప్పవచ్చు. 2008 తర్వాత కాంగ్రెస్ పార్టీ తిరిగి అచ్చంపేట నియోజకవర్గంలో విజయం సాధించలేకపోయింది. 2004లో డాక్టర్ వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయఢంకా మోగించిన ప్పటికీ తదుపరి పరిణామాలు అనంతరం 4 నాలుగుసార్లు అపజయాన్ని చవిచూశారు. అయినప్పటికి పట్టు వీడని విక్రమార్కుడిలా నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై తన వంతు పోరాటాన్ని ప్రభుత్వం వ్యతిరేక తీరును ఎండగడుతూ ముందుకు కొనసాగారు.

అచ్చంపేట గడ్డ కాంగ్రెస్ గడ్డ..

నేటి ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 30న జరిగిన ఓటింగ్ అనంతరం బిఆర్ఎస్ పార్టీ ఎన్ని ఎత్తుగడలు చేసినా కూడా విజయం కాంగ్రెస్ పార్టీదేనని.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అచ్చంపేట గడ్డ.. కాంగ్రెస్ పార్టీ అడ్డ కావడం ఖాయం అని రెండింతల ధీమాతో అభ్యర్థి డాక్టర్ వంశీకృష్ణతో పాటు కాంగ్రెస్ నాయకత్వం ఆనందంతో ఉత్సాహంతో విజయం మాదే అనే ధీమాతో ఉన్నారు.

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కావడం..

నేడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన వ్యక్తి పీసీసీ రేవంత్ రెడ్డి కావడం అచ్చంపేట కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడానికి మరింత సులువుతరమైందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ బహిరంగ సభ సందర్భంగా సభకు వచ్చిన ప్రజానీకాన్ని చూసిన రేవంత్ వంశీకృష్ణను తప్పక సుమారు 50 వేల పైచిలుకు ఓట్లతో గెలుపు ఖాయం ఖరారు అయిందని ఆనాడే ప్రకటించారు. కాగా ఆయన చెప్పిన విధంగా... అంతే ఉత్సాహంతో రేవంత్ సామాజిక వర్గానికి చెందిన నాయకులు, క్యాడర్ తమ వంతు పాత్ర పోషించాలని రేవంత్ సూచనలతో గ్రౌండ్ లెవెల్‌లో, నియోజకవర్గంలో వారు వేసిన ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వంశీకృష్ణ గెలుపుకు వారి వంతు పాత్ర సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ.. గెలుపు కోసం కృషి చేశారని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అలాగే వంశీకృష్ణ సామాజిక వర్గంతో పాటు అన్ని వర్గాలు తన గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయడం మూలంగానే వంశీకృష్ణ గెలుపు మరింత సులుభతరమైందని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.

బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నుంచి ఆదిక్యం..

అచ్చంపేట నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో మొదట బ్యాలెట్ ఓట్ల ఆధిక్యంతో కొనసాగిన వంశీకృష్ణ లీడ్ మొదటి రౌండ్ నుండి చివరి రౌండ్ వరకు ప్రతి రౌండ్లో ప్రత్యర్థిపై పై చేయి సాధించారు. 20 రౌండ్లు పూర్తయ్యే వరకు 49,326 ఓట్ల మెజార్టీతో అచ్చంపేట గడ్డ కాంగ్రెస్ అడ్డా అని మరోసారి నిరూపించేలా ఆయన విజయఢంకా మోగించారు.

ఫలించిన వ్యూహం..

అచ్చంపేట గడ్డపై వలసవాది పెత్తనం, ఆగడాలు, దౌర్జన్యాలు, దాడులు అధికమయ్యాయని, ఇక అచ్చంపేట ప్రజలు సహించే స్థితిలో లేరని తప్పక ప్రత్యర్థి గువ్వల బాలరాజును ఇంటికి పంపడం ఖాయమని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీ పథకాలతో పాటు ఇతర ప్రజాసంక్షేమ అభివృద్ధికి ఏ విధంగా పాటుపడుతుందో ప్రతి గడపకు తీసుకెళ్లే ప్రయత్నం, అలాగే స్థానికుడైన పీసీసీ రేవంత్ రెడ్డి సూచనలు, అధిష్టాన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రతి క్షణం ప్రజల పక్షాన ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండ కట్టడంలో పూర్తిగా సఫలీకృతం అవ్వడం, ఆ దిశగా ప్రజలను కదిలించడం అనేక పోరాటాలు చేస్తు ఓటర్లను తన ఓటు బ్యాంకుగా మలుచుకునే ప్రయత్నంలో పూర్తిగా విజయం సాధించారు.

ఈ ఎన్నికలు..

నేడు జరుగుతున్న ఎన్నికలు దౌర్జన్యానికి దోపిడీకి, ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్నాయని మార్పు రావాలి కాంగ్రెస్ పార్టీ గెలవాలి అనే నినాదం. ఇందిరమ్మ రాజ్యం ప్రతి ఇంటికి ప్రజా సంక్షేమం, నిరుద్యోగుల పాలిట శాపంగా మారిన ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేలా, రైతులు కవులు కర్షకులు, విద్యార్థులు మేధావులు నిరుద్యోగులు అన్ని సామాజిక వర్గాలను ఏకతాటిపై చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలకు మేలు జరగడంతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన సోనియమ్మకు తన రుణం తీర్చుకునే అవకాశం మనకు దక్కుతుందని.. ఇలా అనేక అంశాలను ప్రజల వద్దకు చేర్చి కాంగ్రెస్ పార్టీ విజయం పరంపర కొనసాగేలా జరిగింది.

మంత్రి పదవి వరించనుందా..!

కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో ప్రజాతీర్పులో నాలుగు పర్యాయాలు పరాభవం చూసినప్పటికీ మొక్కవోని దీక్షతో పార్టీ అధిష్టానం ఆదేశాలతో నిత్యం ప్రజల మధ్య ఉంటూ నాగర్ కర్నూల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తన వంతు పాత్రను పోషిస్తూ ప్రజల పక్షాన డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పోరాటం చేశారు. ఈ ప్రజా తీర్పులో అందరూ ఊహించినట్లుగానే 49 వేలకు పైగా ఓట్లు సాధించి అత్యధిక మెజార్టీతో విజయ డంకా మోగించిన నల్లమల్ల ముద్దుబిడ్డ డాక్టర్ వంశీకృష్ణకు ఈ ప్రభుత్వంలో కేబినెట్ హోదా దక్కనుందని ప్రచారం. అది కూడా తాను డాక్టర్ కావడంవల్ల రాష్ట్ర వైద్య శాఖ మంత్రి క్యాబినెట్ హోదా దక్కుతుందని అచ్చంపేట ప్రజలు పార్టీ క్యాడర్ భావిస్తుంది. అందరూ ఊహించినట్లుగానే నూతన క్యాబినెట్‌లో మంత్రిగా అడుగు వేస్తారని అచ్చంపేట ప్రజలు ఆశిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed