- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Double bedroom houses : అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా డబుల్ బెడ్ రూమ్ లు
దిశ, నవాబుపేట : అధికారుల అలసత్వం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా మండల పరిధిలోని యన్మన్ గండ్ల గేటు దగ్గర నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ప్రారంభోత్సవానికి సిద్ధమైన డబుల్ బెడ్ రూమ్ లు పంపిణీకి నోచుకోకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొంది. నిరు పేదలు నివాసం ఉండాల్సిన చోట పశు పక్ష్యాదులు ఆవాసంగా ఉంటున్నాయి. అవి విసర్జించే మలమూత్రాలతో డబుల్ బెడ్ రూమ్ ల పరిసరాలు దుర్వాసనను వెదజల్లుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందే డబుల్ బెడ్ రూమ్ లు పంపిణీకి సిద్ధమయ్యాయి. ఆ సమయంలో జరిగిన నాటకీయ పరిణామాలు వాటి పంపిణీకి ఆటంకంగా మారాయి. వాటిని కేటాయించడానికి అనధికారికంగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే వారు పలు దఫాలు వాటిని స్వాధీనం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. తమ అనుమతి లేకుండా లబ్ధిదారులు వాటి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించడాన్ని అధికారులు ఎప్పటికప్పుడు నిరోధిస్తూ వచ్చారు. దాంతో అవి వృధాగా మారాయి. ఆ డబుల్ బెడ్ రూమ్ లు ఊరికి దూరంగా నిర్మానుష్య ప్రదేశంలో నిర్మించి ఉండడం వల్ల అవి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారికి అడ్డాగా మారాయని, అటువైపు జనసంచారం తక్కువగా ఉండడం వల్ల ఆగంతకుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
దానివల్ల ఆ డబుల్ బెడ్ రూమ్ ల పరిసరాల్లో, జుగుప్సాకరమైన కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మందు బాబులు, వ్యభిచారులు ఆ ప్రాంతాన్ని తమ కార్యకలాపాలు కొనసాగించు కోవడానికి అనువైన ప్రదేశంగా ఎంచుకుని నిర్భయంగా వాటిని కొనసాగిస్తున్నా ఎవరు కూడా పట్టించుకోవడం లేదని పలువురు బాహాటంగా విమర్శిస్తున్నారు. అంతేకాక పశుపక్ష్యాదులు కూడా వాటిని తమ నివాసంగా చేసుకొని సంచరిస్తుండడంతో డబుల్ బెడ్ రూమ్ ల రూపురేఖలు మారిపోతున్నాయని, మరికొన్ని రోజులు వాటిని పంపిణీ చేయకుండా వృధాగా ఉంచితే అవి పంపిణీకి పనికి రాకుండా పోయే పరిస్థితులు నెలకొన్న కూడా వాటి పంపిణీ ధ్యాసను అధికారులు, ప్రజాప్రతినిధులు మరవడం విడ్డూరంగా కనిపిస్తుందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ దుస్థితి నెలకొనక ముందే డబుల్ బెడ్ రూమ్ లను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసి వాటి నిర్మాణపు ఉద్దేశ్యాన్ని నెరవేర్చాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. ఈ మేరకు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, సంబంధిత అధికారులు వాటి పంపిణీకి సత్వరమే చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.