- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమగ్ర కుటుంబ సర్వే చాలా మంచి కార్యక్రమం : ఉప ముఖ్యమంత్రి
దిశ, గద్వాల కలెక్టరేట్ : హౌస్ లిస్టింగ్ పూర్తిచేసుకుని రేపటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎన్యూమరేటర్లు పకడ్బందీగా నమోదులు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. శనివారం నుంచి ప్రారంభమైన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర సర్వే ఇంటింటి కుటుంబ సర్వేపై సీఎస్ శాంతికుమారి, ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాలతో కలిసి జిల్లా కలెక్టర్లుతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ...శనివారం నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజలకు అనేక సందేహాలు వస్తుంటాయని నివృత్తి చేస్తూ ముందుకు సాగాలని సూచించారు. ఎలాంటి సందేహాలున్నా ఎన్యూమరేటర్లు కలెక్టర్ల దృష్టికి తేవాలని పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలు పడకుండా ఎన్యూమరేటర్లకు పూర్తి సమాచారం ఇవ్వాలని సూచించారు. సర్వే ప్రక్రియలో ప్రజల పట్ల ఎన్యూమరేటర్లు భాద్యతగా వ్యవహరించాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సర్వేలో భాగస్వాములు అయ్యేల ఆహ్వానించాలని తెలిపారు.
సమగ్ర కుటుంబ సర్వే చాలా మంచి కార్యక్రమమని ప్రజల సమగ్ర సమాచారం సేకరణ వల్ల అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందించి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేయడానికి దోహదపడతాయని తెలిపారు. హౌస్ లిస్టింగ్ సర్వే దిగ్విజయంగా నిర్వహించారని, అదే ఉత్సాహంతో సర్వే కూడా పూర్తి అయ్యే వరకు పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. సర్వే సమాచారం గ్రామ స్థాయిలోని చిట్ట చివరి ఇంటికి చేరే విధంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, గ్రామాలు, పట్టణాల ప్రధాన కూడళ్ళలో హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులతో మాట్లాడుతూ...సర్వే కొరకు జారీ చేసిన బుక్ లెట్ లో మొత్తం 56 అంశాలున్నాయని ఎలాంటి అనుమానాలు, సందేహాలకు తావు లేకుండా ప్రజల నుండి ఖచ్చితమైన సమాచారం సేకరణతో నమోదులు చేయాలని సూచించారు.
సర్వే ప్రక్రియను సూపర్ వైజర్లు, మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వే ప్రక్రియను నిబద్ధతతో నిష్పక్షపాతంగా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని అన్నారు. ప్రజలు సర్వే సిబ్బందికి సహకరించి సమగ్ర సమాచారం ఇవ్వాలని సూచించారు. సర్వేకు ఒక రోజు ముందు గ్రామాలు, పట్టణంలో విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. ప్రజల నుండి సేకరించిన సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచడం జరుగుతుందని, ఎలాంటి అపోహలు లేకుండా ప్రజలు ఖచ్చిత సమాచారం ఇవ్వాలని సూచించారు. సర్వేపై ప్రజలు ఎలాంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్ రావు, జడ్పీ సీఈవో కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.