- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రాఫిక్ లో ఇరుక్కున్న కలెక్టర్ కారు
దిశ,మక్తల్ : మక్తల్ లో ప్రధాన రహదారి నుంచి తాసిల్దార్ కార్యాలయానికి వస్తున్న కలెక్టర్ కారు ట్రాఫిక్ లో ఇరుక్కోవడంతో.. అసహనం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ హోదాలో పర్యవేక్షణ సమయాల్లో.. కలెక్టర్ కారు రాకపోకలకు ఇలాంటి ఆటంకాలు లేకుండా స్థానిక పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రించాల్సి ఉంటుంది. కానీ ఎవరు పట్టించుకోకపోవడంతో ట్రాఫిక్ లో కలెక్టర్ కారు ఇరుక్కుపోయింది. ఆదివారం రెండో రోజు కుటుంబ సర్వే ,ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాలను పరిశీలించేందుకు కలేక్టర్ సిక్తాపట్నాయక్ జాతీయ రహదారి నుండి తహసిల్దార్ కార్యాలయానికి వస్తుండగా.. రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ చేసిన వాహనాలు ఎదురెదురుగా వస్తున్న వాహనాల మధ్య కలేక్టర్ కారు రెండు నిమిషాల పాటు నిలిచిపోయింది. దీంతో కలేక్టర్ గన్మెన్ కారు దిగి ట్రాఫిక్ ను సరి చేసి.. కారుకు దారి ఏర్పాటు చేశారు. ఈ విషయంపై తాసిల్దార్ ను మున్సిపల్ కమిషనర్ ను " దిశ"ప్రశ్నించగా ట్రాఫిక్ నియంత్రణ పోలీసుల బాధ్యత అని అన్నారు. పార్కింగ్ చేసిన వాహనాలపై సంబంధిత దుకాణ యజమానులను హెచ్చరిస్తామని కమిషనర్ అన్నారు.మక్తల్ లో ప్రధాన రహదారి నుంచి తాసిల్దార్ కార్యాలయానికి వస్తున్న కలెక్టర్ కారు ట్రాఫిక్ లో ఇరుక్కోవడంతో.. అసహనం వ్యక్తం చేశారు.