Collector Badavath Santosh : విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలి

by Aamani |
Collector Badavath Santosh : విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలి
X

దిశ, నాగర్ కర్నూల్ : ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం పౌష్టికాహారం అందించాలని, వంట గదుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ వంట నిర్వాహకులను ఆదేశించారు.బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మైనార్టీ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మైనార్టీ గురుకుల పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని వంటగది పరిసరాలను, కూరగాయలు, నిత్యవసర సరుకులు, నిల్వ ఉన్న బియ్యం నాణ్యతలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ….. విద్యార్థులకు అందిస్తున్న భోజనం పట్ల నిర్లక్ష్యం చేయరాదని నిర్వాహకులకు సూచించారు.

విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని మధ్యాహ్న భోజనాన్ని ఉపాధ్యాయులు పరిశీలించి విద్యార్థులకు అందించాలని సూచించారు. బియ్యంలో పురుగులు ఉంటే ఉన్న బియ్యాన్ని వెనక్కి పంపి వెంటనే కొత్త బియ్యాన్ని ఇవ్వాలని సూచించారు. కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు…..వసతులు ఎలా ఉన్నాయి? అన్ని సబ్జెక్టుల ఉపాద్యాయులు ఉన్నారా? భోజనం ఎలా ఉంటుంది మెనూ తెలుసా మీకు, గుడ్లు, మాసం ఎప్పుడెప్పుడు పెడతారు తదితర విషయాలను విద్యార్థుల వద్ద తెలుసుకున్నారు. వసతులు బాగున్నాయి, భోజనం సైతం బాగుంది అని విద్యార్థులు సమాధానం చెప్పారు. పదో తరగతిలో పదికి పది మార్కులు సాధించాలనే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. అనంతరం నాగర్ కర్నూల్ ప్రభుత్వ జర్నల్ ఆస్పత్రి, పాలెం ఆసుపత్రిని కలెక్టర్ పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.

డెంగు మలేరియా వంటి రోగాలతో వచ్చే ప్రజలకు ఎలాంటి వైద్యం అందిస్తున్నారు.ఆసుపత్రిలో పూర్తిస్థాయి మందులు అందుబాటులో ఉన్నాయా అని కలెక్టర్ వైద్యులతో ఆరా తీశారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను .. మందుల నిలువ గది, రోగుల ఇన్ పేషంట్ వార్డు , ఆపరేషన్ థియేటర్, ల్యాబ్ తదితర విభగాలను తనిఖీ చేశారు.. ఆసుపత్రి ఆవరణ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని వైద్యాధికారికి సూచించారు. ఆరోగ్య కేంద్రంలో కాన్పులు ఎక్కువగా జరిగేటట్లు చూడాలని, వర్షాకాలం సీజనల్ వ్యాధులు అధికంగా వ్యాపించే కాలం కాబట్టి వైద్యులు వైద్య సిబ్బంది ఎప్పుడూ అప్రమత్తంగా ఉండి వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రజలు రోగాల బారిన పడకుండా ముందస్తుగా వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed